Home కామారెడ్డి ప్రేమ పెళ్లిపై కక్షతో ముగ్గురి హత్య

ప్రేమ పెళ్లిపై కక్షతో ముగ్గురి హత్య

Murder

కూతురిని, సోదరుడిని అతడి కుమార్తెను హతమార్చిన ఘాతుకం
 మృతుల్లో ఆరేళ్ల చిన్నారి
 మృతుని సోదరుడే హంతకుడు?
 ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం
 కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో దారుణం

మన తెలంగాణ/కామారెడ్డి/దోమకొండ:సొంత కూతురుతో పాటు సోదరుడిని, అతని కూతురును దా రుణంగా హత్య చేసిన ఘటన శనివారం నాడు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో సంభవించింది. తాను చెప్పి నా వినకుండా తన సోదరుడి కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో కసి పెంచుకుని బండె రవి అనే వ్యక్తి ముగ్గురి గొంతూకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మినారాయణ తెలపిన వివరాల ప్రకారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బండెల బాలయ్య(45), బండెల లత(15), బండెల చందన(6)లు దారుణంగా హత్యకు గురయ్యారు. దోమకొండ మండలంలోని మల్లన్న ఆలయం వద్ద శనివారం మృతదేహలను స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు బండెల రవే హత్యకు కారకుడు అని పోలీసులు గుర్తించారు. మృతుని కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు మృతుని పెద్ద కూతురు దీప(21) ప్రేమ వివాహం చేసుకోవడమే కారణమని తేలింది. అదే గ్రామానికి చెందిన యువకునితో ప్రేమవివాహనికి తండ్రి బాలయ్య ఒప్పుకోగా సోదరుడు రవి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ అందర్నీ హత్య చేసి తాను చస్తానంటూ బెదిరించినట్లు గ్రామస్థులు వెల్లడించారు.

శుక్రవారం సాయంత్రం బాలయ్యతో పాటు ఆయన కూతురు లత, తన కూతురు చందనను వాహనంపై తీసుకెళ్లి రాత్రికి ఇంటికి తిరిగి రాకపోగా రాత్రంతా గాలించారు. ఉదయం దోమకొండ నుంచి మృతదేహాల వార్త రావడంతో కుటుంబీకులతో పాటు గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సంఘటన స్ధలానికి స్ధానిక ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్, కామారెడ్డి డిఎస్పీ లక్ష్మినారాయణలు చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహల పక్కన థామ్‌సప్ సీసాలు, పురుగు మందుల డబ్బాలు ఉండడంతో వాటిని తాగించి బ్లేడుతో గొంతుకోసినట్లు నిర్ధారించారు. హంతకుడు మృతుని సోదరుడే అని స్పష్టం చేసిన స్ధానికులు హత్య చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తూ పరిసర ప్రాంతాలను జల్ల్లెడ పట్టారు. సమీపంలోని పంట పొలాలను గాలించి చెరువు ప్రాంతంలో ఆనవాళ్ల కోసం ప్రయత్నించారు. మరో రోజులో మృతుని జాడ తెలిసే అవకాశం ఉందని స్ధానికులు భావిస్తున్నారు. పోలీసులు మృతుల కుటుంబీకుల అభిప్రాయాలను నమోదు చేసుకుని, గ్రామస్తుల నుండి సైతం వివరాలను రాబడుతున్నారు. కేసు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Love marriage leads to triple murder in kamareddy