Home తాజా వార్తలు సుకుమార్‌తో లవ్ స్టోరీ మూవీ

సుకుమార్‌తో లవ్ స్టోరీ మూవీ

allu arjun

 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని స్టార్ హీరో అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సుకుమార్… సూపర్‌స్టార్ మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ రాసి అతనికి వినిపించారు కూడా. కానీ మహేష్‌కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకంటే మంచి ఎంటర్‌టైనర్ చేస్తే బాగుంటుందని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా సుకుమార్ ఆ స్మగ్లింగ్ నేపథ్యంలో కథను అల్లు అర్జున్‌కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి అతనికి వినిపించి.. మొత్తానికి సినిమాను ఓకే చేసుకున్నారు.

అయితే బన్నీ ముందు ఓకే చెప్పినప్పటికీ ఆ తర్వాత వేరే కథ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా లవ్ స్టోరీ చేద్దామని సుకుమార్‌తో అన్నారట. దీంతో కొన్ని రోజులుగా ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఓ లవ్ స్టోరీ రాస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలిసింది. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతారేమో చూడాలి.

Love Story Movie with Sukumar