Thursday, April 25, 2024

యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్యనారాయణపూరంలో సౌజన్య, సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి మధ్య మనస్పర్థలు రావడంతో సందీప్‌కు సౌజన్య దూరంగా ఉంటుంది. సౌజన్యతో మాట్లాడుకుందామని సందీప్‌ ఆమెను గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ముందస్తు ప్లాన్ ప్రకారం కత్తితో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సందీప్‌కు రక్తపు మరకలు కనిపించడంతో సిఐ రమేశ్  యువకుడిని ప్రశ్నించాడు. యువతిపై కత్తితో దాడి చేసి వస్తున్నానని చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి సందీప్‌ను తీసుకెళ్లి యువతిని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సదరు యువతిని ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News