Home జాతీయ వార్తలు నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….

నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….

Lover killed bride after suicide at haryana

ఛండీగఢ్: నవ వధువును చంపేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాన్ కౌన్ గ్రామంలో రాజేశ్(30)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజేశ్ తన గ్రామంలోని ప్రియాంకతో (20) వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూన్ 29న ప్రియాంకకు పెళ్లి జరిగింది. శనివారం తన అత్తగారింటి నుంచి పుట్టింటికి ప్రియాంక వచ్చింది. ఈ విషయం తెలిసిన రాజేష్ ఆమె ఇంటికి వెళ్లి గ్రామ శివారులోని దాబాకు ఆమెను తీసుకెళ్లాడు. ఆమెను తుపాకీతో కాల్చి చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు కనిపించడంలేదని తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానికులు రెండు మృతదేహాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.