Thursday, March 28, 2024

బాయ్ ఫ్రెండ్ భార్య కళ్లలో ఫెవిక్విక్ పోసి…. జుట్టు కత్తిరించి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుందనే కోపంతో నవ వధువు నిద్రిస్తుండగా ఆమె జట్టు కత్తిరించి కళ్లలో ఫెవి క్విక్ పోసి పారిపోతుండగా లవర్‌ను పట్టుకున్న సంఘటన బిహార్‌లోని నలంద ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాల్ రామ్ అనే వ్యక్తికి స్వాతి (పేరు మార్చబడింది) గర్ల్ ఫ్రెండ్ ఉంది. గోపాల్ రామ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆమెపై గర్ల్ ఫ్రెండ్ పగ పెంచుకుంది. గోపాల్ రామ్ పెళ్లి చేసుకున్న అనంతరం తన సొంతూరు మోరా తాలాబ్ గ్రామానికి నవ వధువుతో కలిసి వచ్చాడు. గోపాల్ రామ్ చెల్లెలు ద్వారా స్వాతి ఇంట్లోకి వచ్చి అందరితో కలిసి మెలిసి ఉంది. రాత్రి సమయంలో నవ దంపతులు గాఢనిద్రలో ఉండగా వాళ్ల గదిలోకి స్వాతి ప్రవేశించి, పెళ్లి కుమార్తె జట్టును కత్తిరించింది. అనంతరం ఆమె కళ్లలో ఫెవి క్విక్ పోయడంతో కళ్లు మండి వన వధువు అరిచింది. వెంటనే బంధువులు మేల్కొని స్వాతి పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. పెళ్లి కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. భగన్ బిఘా పోలీస్ అధికారి మహ్మాద్ సిబ్లి నోమాని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News