Home తాజా వార్తలు లింగాలలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

లింగాలలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

Lovers commits suicide in Nagarkurnool

 

లింగాల: నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం శ్రీరంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఎద్దుల సలేశ్వరం (19) అదే గ్రామానికి చెందిన ఉడుత అనురాధ (21) గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇటీవల అమ్మాయికి కుటుంబసభ్యులు వేరే వ్యక్తితో  నిశ్చితార్థం చేశారు. సలేశ్వరం ఈనెల 15వ తారీకు సాయంత్రం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చి రాధను తీసుకొని వెళ్ళిపోయాడు. అనంతరం శ్రీరంగాపూర్ శివారులోని రామచంద్రయ్య కుంట ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. విగతజీవులుగా చెట్టుకు వేలాడుతున్న మృతులను గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Love couple commits suicide in Nagarkurnool