Home జాతీయ వార్తలు యూపీలో ప్రేమజంట ఆత్మహత్య…

యూపీలో ప్రేమజంట ఆత్మహత్య…

Lovers Commits Suicide In Up State

యూపీ: ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పుర్కాజి పోలీస్ స్టేషన్ లో పరిధిలోని చెరుకు తోటలో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..సోనమ్ అనే యువతికి అమిత్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ నెల 24న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సోనమ్ అమిత్ సోదరుడు సతేందర్ తో ప్రేమలో పడింది. సతేందర్ కు అంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి మరో వారం రోజులే సమయం ఉండటంతో..ఏం చేయాలో తెలియక సతేందర్, సోనమ్ ఇద్దరు కలిసి చెరుకు తోట వైపు వెళ్లి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో ఎంపీ సింగ్ తెలిపారు.

Lovers Commits Suicide In Up State