Friday, March 29, 2024

పొన్కల్‌లో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lovers committed suicide by hanging in Nirmal

ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
వాట్సప్ స్టేటస్ ద్వారా వైరల్

మామడ(లక్ష్మణచాంద): కుల మతాలు లేనిదే ప్రేమ. వయస్సుతో సంబంధం లేనిదే ప్రేమ. ప్రేమ ఎంత పరిమానాలనైన ఎదుర్కొగలదు. ఎంతకైన తెగించగలదనే ఈ మాటలు చాలా సార్లు వింటుంటాం. అలాంటి సంఘటననే చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన అబ్బాయి హరీష్(20)కుమ్మరి), అదే గ్రామానికి చెందిన అమ్మాయి నిక్షిత(18)కాపు) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వారి ప్రేమను నిరాకరించారనే మానస్థాపానికి గురైన ప్రేమ జంట బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్యకు ముందు మృత్యుడు హరీష్ తన వాట్సాప్ స్టేటస్‌లో మేము చాల సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి మృతికి అమ్మాయి వాళ్ల అమ్మ, వాళ్ల బావలే కారణం అని వాట్సాప్ స్టేటస్‌లో ప్రచారం చేశారు. చివరిగా సారీ అమ్మ నాన్న అంటూ ప్రాణాలు విడిచారు. ఈ వాట్సాప్ స్టేటస్ ప్రచారం కావడంతో స్థానికులందరికి విషయం తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News