Home జాతీయ వార్తలు బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య?

బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య?

 

ముంబయి: మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ శివారులోని ఓ ప్రేమ జంట మృతదేహాలు నీళ్లున్న బావిలో కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువకుడు (18) ఇంటర్ చదువుతూ తన పక్క గ్రామానికి చెందిన మైనర్ బాలికను (17) ప్రేమించాడు. ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం బాలిక ఇంట్లో తెలియడంతో ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో డిసెంబర్11న బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రుల అంబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం ఓ బావిలో రెండు మృతదేహాలు కనిపించాయని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. యువతి, యువకుడి తల్లిదండ్రులకు సమాచారం వాళ్లు ఘటనా స్థలానికి చేరుకొని తమ కూతురు, కుమారుడేనని గుర్తించారు. యువతి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వాళ్లు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కుటుంబ సభ్యులు ఇద్దరి మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Lovers Dead Bodies Found in Well in Maharashtra,
Girls family fixed he marriage with another youth from her Community later boy and girl Fled their homes
Lovers Dead Bodies Found in Well in Maharashtra