Thursday, March 28, 2024

లిఫ్ట్ అడిగాడు… గొంతు కోశాడు…

- Advertisement -
- Advertisement -

Lovers Husband murder in Jagtial

మనతెలంగాణ/గొల్లపల్లి: అక్రమసంబందానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియురాలు భర్తను ప్రియుడు హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామంలో జరిగింది. నెల్లూరు జిల్లా వింజమూర్ గ్రామానికి చెందిన షేక్ ఇల్లియాజ్ భాషా (30) సెంట్రింగ్ పని నిమిత్తం రెండేళ్ల క్రితం జగిత్యాల జిల్లాకు వలస వచ్చాడు. లక్ష్మీపూర్ గ్రామంలో ఉండగా అదే గ్రామానికి చెందిన షేక్ మొమీనను పెళ్లి చేసుకుని యశ్వంతరావుపేట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గతంలో మొమీనకు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం కాగా, మరిది వరుస అయిన ఎండి ఖదీర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందనే నెపంతో మొదటి భర్త విడాకులు ఇవ్వడం జరిగింది.

ఆ తర్వాత షెక్ ఇల్లియాజ్ తో 2020 మే నెలలో రెండో వివాహం చేసుకుంది. మొమీనకు విడాకులు అయితే తనతోనే ఉంటుందని భావించిన ఖదీర్ అలా జరగకపోవడంతో ఆమెను పెళ్లి చేసుకున్న ఇల్లియాజ్‌ను చంపేస్తే మొమీనా తనకే దక్కుతుందనే ఉద్దేశ్యంతో గత కొంతకాలంగా షేక్ ఇల్లియాజ్  కదలికలపై ఖదీర్ నిఘా పెట్టాడు. మంగళవారం రాత్రి యశ్వంతరావుపేట నుంచి లక్ష్మీపూర్ వైపు బైక్‌పై వస్తున్న ఇల్లియాజ్‌ను లిఫ్ట్ అడిగి బైక్‌పై వెనక కూర్చొని వెంగళాపూర్ గ్రామ శివారులోకి చేరుకోగానే పథకం ప్రకారం ఖదీర్ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో వెనుక నుండి గొంతు కోసం ఇల్లియాజ్‌ను హత్య చేసి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News