Home తాజా వార్తలు ప్రియుడి భార్యను చంపించిన ప్రియురాలు

ప్రియుడి భార్యను చంపించిన ప్రియురాలు

The Indian who fell from the building in Dubai

ఢిల్లీ: ప్రియురాలు తన ప్రియుడితో ఆయన భార్యను చంపించిన ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విక్రంసింగ్ చౌహాన్, దీపిక చౌహాన్ అనే దంపతులకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది.  దీపిక చౌహాన్ బ్యాంకు ఉద్యోగి. షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రం సింగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీపికకు భర్త అక్రమ సంబంధం తెలియడంతో దంపతుల మధ్య రోజు గొడవలు జరుగుతుండేవి. షెఫాలినీ రెండో వివాహం చేసుకొని వేరే కాపురం పెట్టాడని దీపికకు తెలిసింది. దీంతో విక్రం సింగ్, దీపికల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. తనకు తన భార్యకు వాగ్వాదం జరుగుతుందని గూగుల్ చాటింగ్‌లో ప్రియురాలికి విక్రమ్  సందేశం పెట్టాడు. ఆమె ఎనిమిదో అంతస్థు నుంచి కిందకు నెట్టేయండని రిప్లై ఇచ్చింది. విక్రం తన భార్యను భవనం పైనుంచి కిందకు నెట్టేశాడు. భార్య దీపిక ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విక్రమ్ అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆమె హస్తం ఉందని తెలియడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని తెలిసింది.

Lovers Wife Murder in Delhi

Telangana news