Thursday, April 25, 2024

అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి: హరీష్

- Advertisement -
- Advertisement -

Low debit state is telangana

హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన బకాయిలపై కేంద్రం స్పందించడంలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు 2020కు శాసన మండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ కోశ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ బిల్లు 2020కి శాసన మండలి ఆమోదం తెలిపింది. శాసన మండలిలో హరీష్ రావు మాట్లాడారు. బకాయిల విడుదల కోసం లేఖలు రాసినా మోడీ ప్రభుత్వం జవాబు ఇవ్వడంలేదని మండిపడ్డారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోందని, కరోనా సమయంలో కోత విధించిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని సభకు హరీష్ వివరించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచుకోవడానికి కేంద్రం అనే నిబంధనలు పెట్టిందని, అప్పులు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలు తీసుకోవడానికి ఉండదని, ఆదాయం… అప్పుల విషయంలో తెలంగాణ 28వ స్థానంలో ఉందని, అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని తెలియజేశారు. క్లిష్టమైన సమయంలో కూడా అన్ని స్కీమ్‌లకు నిధులు విడుదల చేస్తున్నామని, సంక్షేమం జరుగుతున్న అభివృద్ధిలో ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News