Friday, March 29, 2024

లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యులు గురువారం వివిధ అంశాలను లేవనెత్తడం, నినాదాలు చేయడంతో లోక్‌సభ, రాజ్యసభలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అదానీ అంశాన్ని,సరిహద్దులో చైనా చొరబాటు, రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడంతో ఉభయసభల్లో గలాభా చోటుచేసుకుంది. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా ప్రతిపక్షాలు ఆక్షేపణలు తెలిపాయి. పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యత్యాసాలు, నిరుద్యోగం వంటి విషయాలపై కేంద్రం ఏమిచేయడంలేదంటూ వ్యతిరేకతను తెలిపాయి. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంపికచేసుకున్న పెట్టుబడి పద్ధతి’ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ బృందంతో లేక సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News