Saturday, April 20, 2024

మళ్లీ మెరిసిన లబూషేన్

- Advertisement -
- Advertisement -

Lubushane

 

రాణించిన స్మిత్, ఆస్ట్రేలియా 289/3, కివీస్‌తో చివరి టెస్టు

సిడ్నీ: న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ సంచలనం మార్నస్ లబూషేన్ మరోసారి సెంచరీతో కదం తొక్కాడు. స్మిత్ కూడా తనవంతు పాత్ర పోషించడంతో ఆస్ట్రేలియా తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఓపెనర్ జోయ్ బర్న్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. గ్రాండోమ్ వేసిన అద్భుత బంతికి బర్న్ ఔటయ్యాడు. బర్న్ 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 39 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబూషేన్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు.

ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. అయితే ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ జోడీని వాగ్నర్ విడగొట్టాడు. కుదురుగా ఆడుతున్న వార్నర్‌ను వాగ్నర్ వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ మూడు ఫోర్లతో 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 95 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. కానీ, తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌తో కలిసి లబూషేన్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ముందుకు సాగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ స్కోరు ను నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించలేదు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు.

దీంతో ఆస్ట్రేలియా స్కోరు మరో వికెట్ పడకుండానే 250 పరుగులు దాటింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 182 బంతుల్లో 4 ఫోర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 156 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన లబూషేన్ 210 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మాథ్యూ వేడ్ 22 (బ్యాటింగ్) అతనికి అండగా ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. ఇదిలావుండగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 20 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టారు.

Lubushane shiny again
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News