Wednesday, April 24, 2024

పాయల్‌కు లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Luckey offer rajputh payal in tollywood

 

తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో బోల్డ్ సీన్‌లలో రెచ్చిపోయి నటించింది ఈ భామ. ఈ సినిమాతో అర డజను చిత్రాల్లోఅవకాశాలను సంపాదించుకుంది. వీటిలో ‘వెంకీమామ’ చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది పాయల్. ఈ నేపథ్యంలో ఈ భామకు ఓ బంగారంలాంటి ఆఫర్ దక్కింది. ‘భారతీయుడు 2’ సినిమాలో పాయల్ ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు. ఇప్పుడు ఈ చిత్రంలో పాయల్‌కు అవకాశం దక్కడం విశేషం. శంకర్ సినిమాల్లో పాటలన్నీ రిచ్‌గా ఉంటాయి. అందులోనూ ఐటమ్ సాంగ్ అంటే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తాడు. పైగా తన సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ ఉంటుంది. ఏ లెక్కన చూసినా ఈ సినిమాతో పాయల్ దశ తిరగడం ఖాయమంటున్నారు. మరి ఈ అవకాశాన్ని పాయల్ రాజ్‌పుత్ ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News