Thursday, March 28, 2024

బాలీవుడ్‌లో లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Lucky offer in Bollywood to Rakul Preet singh

 

దక్షిణాది నుండి ఉత్తరాది వరకు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎందుకంటే దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు అందరు హీరోలతో మూవీస్ చేసేసింది ఈ పొడుగుకాళ్ళ సుందరి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలను కూడా లైనప్ చేసి పెట్టేసింది. చేతినిండా సినిమాలతో ఇప్పట్లో ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. జయ జానకినాయక సినిమా తర్వాత రకుల్ తెలుగులో ఒక హిట్ కూడా అందుకోలేదు. ఆ మధ్యలో కింగ్ నాగ్‌తో ‘మన్మధుడు- 2’ చేసినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ ఏడాది చెక్ సినిమాలో నటించింది.

ఇప్పటికైతే క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం కలిగిన మూవీ చేసింది. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్- 2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమా చేస్తోంది. మొత్తానికి రకుల్‌ప్రీత్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలిసింది. అదికూడా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన కావడం విశేషం. అక్షయ్‌తో బెల్ బాటమ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు రంజిత్ తివారి.. తదుపరి సినిమా కూడా అతనితోనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయినట్లు సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోగా పట్టాలెక్కానుందట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News