Home సినిమా క్రేజీ మూవీతో బాలీవుడ్‌లోకి

క్రేజీ మూవీతో బాలీవుడ్‌లోకి

విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్‌గా నటించిన భామ షాలినీపాండే ఆతర్వాత తెలుగులో మంచి ఆఫర్లను దక్కించుకోలేకపోతోంది. చిన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ పాత్రలే ఆమెకు దిక్కవుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ‘100% లవ్’ రీమేక్ ‘100% కాదల్’ చిత్రంలో ఆమె నటిస్తోంది. షాలినీకి దక్కిన పెద్ద ఆఫర్ ఇప్పటివరకు ఇదే. ఇక తెలుగులో కల్యాణ్‌రామ్ చిత్రం ‘118’లో ఒక హీరోయిన్‌గా చేస్తోంది.

దీంతో పాటు మూడు సినిమాల్లో నటిస్తోంది. మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు బాలీవుడ్‌లో పెద్ద ఆఫర్ దక్కింది. బాలీవుడ్‌లో పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య హీరోగా పరిచయం కాబోతున్న ‘బాంఫాడ్’ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటువంటి క్రేజీ మూవీతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది షాలిని పాండే.

Lucky Offer to Arjun Reddy’s Heroin Shalini Pande