Thursday, April 25, 2024

పొగతాగనివారిని కబలిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్

- Advertisement -
- Advertisement -

వాయుకాలుష్యంతోనే సంభ విస్తుందంటున్న వైద్యులు
వృద్దులే కాకుండా యువతను వణికిస్తున్న మహమ్మారి
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడమే కీలకమంటున్న వైద్యులు

మన తెలంగాణ,సిటీబ్యూరో: గత కొన్ని దశాబ్దాలుగా ఊపిరితిత్తుల కేన్సర్ తన స్వరూపం, స్వభావాలను మార్పుకుంటూ వస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మగవారిలో పొగతాగేవారిని, వృద్దులను మాత్రమే ఎక్కువ కబళిస్తుండగా, ఇప్పడు యువతకు, ఎప్పుడు పొగతాగనివారికి, మహిళలకు వస్తోందని పేర్కొంటున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరిలో క్యాన్సర్ మరణాల్లో ఎక్కువశాతం కారణం ఊపిరితిత్తుల క్యాన్సరని చెబుతున్నారు. ఈవ్యాధి రావడానికి ప్రధాన కారణంగా సిగరేట్లు కాల్చడమేనని, మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 80శాతం దానితో వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దేశంలో పొగతాగనివారిలో ప్రమాదకర స్దాయిలో క్యాన్సర్ పెరుగుతోందని, రొమ్ము, పాంక్రియాటిక్, ప్రొస్టేట్ క్యాన్సర్లన్నింటివల్ల సంభవించే మరణాల కంటే కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలు ఎక్కువ.

పోగతాగనివారిలోను ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య 30నుంచి 40శాతం పెరిగిందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వాయు కాలుష్యంతోనే పొగతాగని యువత, మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమని, వంటనూనెల నుంచి వచ్చే ఆవిర్లు, బొగ్గు, పొయియ, పొగ, ఇతరులు సిగరేట్లు కాల్చినప్పుడు వచ్చే పొగ, వాయుకాలుష్యం, బయోమాస్ ఇంధనాలతో పొగతాగనివారిలో, మహిళల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని చెబుతున్నారు. 30నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కలు, అసలు పొగతాగనివారిలో పర్యావరణ, జన్యుపరమైన కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నట్లు, వాయు నాణ్యత, కాలుష్యంతో కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాలు సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు.పొగతాగనివారి కంటే, పొగతాగేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్లలో రకాలు వేర్వేరుగా ఉంటాయని, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లు పొగతాగేవారికే వస్తుండగా, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లు పొగ తాగనివారికి వస్తున్నాయంటున్నారు. ఎప్పుడు పొగతాగనివారిలో మరణాలు 20శాతం కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్. పొగతాగడంతో పాటు కుటుంబ చరిత్ర, జన్యు కారణాలతో కూడా ఇది వస్తోందని, క్యాన్సర్ బాగా ముదిరిపోయి, ఇతర ప్రాంతాలకు వ్యాపించిన పరిస్దితుల్లోనే చాలా కేసులు కనిపిస్తున్నాయంటున్నారు. వీరికి శస్త్రచికిత్స, కెమోథెరపీ, రేడియేషన్‌తో పెద్దగా ఫలితాలుండవని, లక్షణాలు చాలావరకు తగ్గి, కోలుకునే అవకాశాలు కొంతవరకు ఉంటాయని, ముందుగా గుర్తిస్తే మరణాలను 20శాతం వరకు తగ్గించవచ్చన్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడం కీలకం: డా. సురేంద్ర బత్తుల

క్యాన్సర్ త్వరగా గుర్తించడం కీలకమని, స్టేజి 1లో గుర్తిస్తే 49శాతం మందికి ఐదేళ్లు బతికే అవకాశముంటుందని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి వైద్యులు డా. సురేంద్ర బత్తుల పేర్కొన్నారు.అదే 3బిలో అయితే 5 శాతం మాత్రమే ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పిందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై విజ్ఞానం పెరుగుతుందని, రోగుల్లో ఎవరి తీరును బట్టి వారికి చికిత్స చేసేందుకు మాలిక్యులర్ డయాగ్నస్టిక్ టెక్నిక్‌లు ఉపయోగపడుతాయని తెలిపారు. ఎపిడెర్మల్ గ్రోత్ ప్యాక్టర్ రిసెఫ్టర్ బ్లాకరైన ఎల్రాటినిబ్, ఎఫటినిబ్, బెఫిటినిబ్ లాంటి టార్గెటెడ్ థెరపిలతో కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాలున్న రోగులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఈమందులు కణాల వృద్దికి దోహదపడే ఈజీఎఫ్‌ఆర్ సంకేతాలను అడ్డుకుంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇటీవల ఇమ్యూన్ బేస్ట్ తెరపీలు బాగా ఉపయోగపడుతాయన్నారు. కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాలున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఈ తరహా చికిత్స బాగా ఉపయోగపడుతోందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News