Thursday, April 18, 2024

కరోనా వీడినా… వదలని ఊపిరితిత్తుల సమస్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కరోనా నుంచి విముక్తి పొందినప్పటికీ రెండేళ్ల వరకూ ఊపిరితిత్తుల సమస్యలు నిరంతరం వెంటాడుతున్నట్టు ఛాతీ ( chest ) సిటి స్కాన్లు చూపెడుతున్నాయి. కరోనా వల్ల తలెత్తే ఊపిరి తిత్తుల సమస్యలపై రెండేళ్ల పాటు నిర్వహించిన మొట్టమొదటి పరిశోధన ఇదే . జర్నల్ రేడియాలజీ లో ఈ అధ్యయనం వెలువడింది. చైనా లోని వుహాన్ కు చెందిన హుయాజాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని టాంగ్‌జీ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా సోకిన తరువాత రోగుల్లో ఊపిరి తిత్తుల సమస్యల అవశేషాలు ఎంతవరకు ఉన్నాయో వీరు పరిశీలించారు. ఊపిరితిత్తుల రుగ్మతల అవశేషాలు, ఊపిరితిత్తుల పనితీరుకు మధ్య ఉన్న సహసంబంధాన్ని విశ్లేషించారు. మొత్తం 144 మంది కరోనా రోగుల్లో 79 మంది పురుషులు, 65 మంది మహిళలు. వీరంతా అరవై ఏళ్ల మధ్యస్త వయసు వారు. 2020 జనవరి 15 నుంచి మార్చి 10 లోగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

వీరికి కొవిడ్ లక్షణాలు ప్రారంభమయ్యేనాటి నుంచి ఆరు నెలల తరువాత ఒకసారి, 12 నెలల తరువాత ఒకసారి, రెండేళ్ల తరువాత మరోసారి వరుసగా తీసిన మూడు సీరియల్ ఛాతీ సిటి స్కాన్లు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్‌ల ఫలితాలు విశ్లేషించారు. గత రెండేళ్ల లో ఊపిరి తిత్తుల అసాధారణ సమస్యలు క్రమంగా తగ్గుతున్నట్టు కనిపించింది. ఆరు మాసాలకు రోగుల్లో 54 శాతం మందిలో ఊపిరితిత్తుల అసాధారణ సమస్యలు కనిపించాయి.రెండేళ్ల నిరంతర సిటి స్కాన్ల అధ్యయనంలో 39 శాతం లేదా 56 మంది రోగుల్లో ఊపిరితిత్తుల అసాధారణ సమస్యలు కనిపించాయి. వీరిలో 23 శాతం లేదా 33 మంది రోగుల్లో ఫైబ్రోటిక్ లంగ్ అబ్ నార్మాలిటీస్ ఉండగా, అంటే ఊపిరి తిత్తుల కణజాలంలో దళసరిగా తొడుగులు కనిపించడం, అలాగే 23 మంది రోగుల్లో అలాంటి లక్షణాలు లేకపోవడం కనిపించింది. ముఖ్యంగా ఈ లక్షణాలు కొవిడ్ తరువాత రెండేళ్లుగా స్థిరంగా కొనసాగడం ముఖ్యమైన విషయం. మిగతా 88 కేసుల్లో లేదా 61 శాతం మందిలో ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News