Home తాజా వార్తలు ‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ

‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ

 మార్కెట్లోకి ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో లుపిన్ మాత్రలు
 ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు డిసిజిఐ నుంచి అనుమతి
 మార్కెట్లో ఏ మెడిసిన్ చౌక?

న్యూఢిల్లీ: కోవిడ్ -19 మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కోసం వినియోగించే పావిపిరవిర్ డ్రగ్‌ను తయారు చేయడంలో దేశీయ ఫార్మా సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు డిసిజిఐ(డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి పొందాయి. ఆ కంపెనీ వివి ధ పేర్లతో టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేశా యి. తాజాగా ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ మెడిసిన్‌ను ఫార్మా సంస్థ లుపిన్ బుధవారం విడుదల చేసింది. ఒక టాబ్లెట్ ధర 49 రూపాయలుగా నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫావిపిరవిర్ డిసిజిఐ నుండి అనుమతి పొందిందని రెగ్యులేటరీ సమాచారంలో లుపిన్ తెలిపింది. ఈ ఔషధం 200 ఎంజి టాబ్లెట్లతో 10 మాత్రల స్ట్రిప్ రూపంలో లభిస్తుంది. ప్రతి టాబ్లెట్ ధర రూ.49 అని కంపెనీ వెల్లడించింది. లుపిన్ బలమైన పంపిణీ నెట్‌వర్క్‌తో కోవిహాల్ట్‌ను దేశవ్యాప్తంగా చేరేలా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోం ది. ఇప్పటికే పలు కంపెనీలు ఫావిపిరవిర్ మెడిసిన్ కోసం డిజిసిఎ నుంచి ఆమోదం పొందాయి. వాటిలో గ్లెన్‌మార్క్, సిప్లా, హెటెరో, బ్రింటన్ ఫార్మా, జెన్‌బర్ట్ ఉన్నాయి. ఈ డ్రగ్ విక్రయానికి గాను ఇన్నోవేటర్ కంపెనీ ఫుజిఫిల్మ్‌తో డా.రెడ్డీస్ ఇటీవల ఒప్పందం చేసుకుంది.
జెనెరా ఫార్మాకు డిసిజిఐ అనుమతి
హైదరాబాద్‌కు చెందిన జెనెరా ఫార్మా తాజాగా ఫావిపిరవిర్ టాబ్లెట్ల విక్రయానికి గాను డిసిజిఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి పొందింది. కరోనా మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు వినియోగించే ఈ టాబ్లెట్లను ‘ఫావిజెన్’ పేరుతో విక్రయించనుంది. హైదరాబాద్ నుంచి తయారు చేసే ఈ సంస్థ యుఎస్ ఎఫ్‌డిఎ అనుమతితో ఇక్కడ ఔషధాల తయారీచేస్తోంది.
ఫ్లుగార్డ్ ధర రూ.35
ఆగస్టు 4న సన్ ఫార్మా ‘ఫ్లూగార్డ్’ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్‌ను విడుదల చేసింది. 200ఎంజి కల్గి న ఈ ఫావిపిరవిర్ టాబ్లెట్ ధర రూ.35గా నిర్ణయించింది. కరోనా వైరస్ మధ్యస్థ లక్షణాలు కల్గివారి చికిత్సకోసం వినియోగించే ఈ ఔషధం ఇప్పటివరకు మార్కెట్లోకి ఉన్నవాటి కంటే అత్యంత తక్కువ. అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను తాము ఫ్లూగార్డును తక్కువ ధరకే అందిస్తున్నామని సన్‌ఫార్మా ఇండియా బిజినెస్ సిఇఒ కీర్తి గనోర్కర్ అన్నారు.
హెటెరో టాబ్లెట్ ధర రూ.59
హెటెరో గ్రూపులో భాగమైన హెటెరో ల్యాబ్స్ కూడా కోవిడ్ -19 చికిత్సకు ఉపయోగించే ఫావిపిరవిర్ జెనెరిక్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ‘ఫావివిర్’ బ్రాండ్ కింద మార్కెట్లో విడుదల చేసిం ది. పావివిర్ తయారీ, మార్కెట్ చేయడానికి హెటె రో డిసిజిఐ(జనరల్ కంట్రోలర్ ఆఫ్ మెడిసిన్స్ ఆఫ్ ఇండియా) నుండి అనుమతి పొందింది. ఈ జెనెరిక్ డ్రగ్ ఫావివిర్ టాబ్లెట్ ధర రూ.59గా దీనిని హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ పంపిణీ చేసి మార్కెటింగ్ చేస్తోంది.
గ్లెన్‌మార్క్ ‘ఫ్యాబిఫ్లు’ రూ.75
ఔషధ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కోవిడ్ -19 చికిత్సకు ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27 శాతం తగ్గించి టాబ్లెట్ రూ.75 చొప్పున అందిస్తోంది. సంస్థ ఈ డ్రగ్‌ను ‘ఫ్యాబిఫ్లు’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవా రం ‘ఫ్యాబిఫ్లు’ ధరను 27 శాతం తగ్గించినట్లు తెలిపింది. ఇప్పుడు గరిష్ట రిటైల్ ధర టాబ్లెట్‌కు రూ.75గా ఉంది.
రెమెడెస్విర్ ధర రూ.4700
టజూబిలంట్ లైఫ్ సైన్సెస్ తన సంస్థ జూబిలంట్ జనరిక్స్ సోమవారం కరోనా డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో ‘రెమ్‌డెసివెరా’ బ్రాండ్‌ను విడుదల చేసింది. ‘జూబిఆర్’ పేరిట విడుదల చేసిన ఈ ఇంజెక్షన్ ధర రూ.4,700గా భారతదేశం మార్కె ట్లో నిర్ణయించారు.
జైడస్ కాడిలా వ్యాక్సిన్ రెండో దశ పరీక్షలు
కోవిడ్19 వ్యాక్సిన్ ‘జైకోవ్-డి’ మొదటి దశ పూర్తయిందని, ఇప్పుడు కంపెనీ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆగస్టు 6న ప్రారంభిస్తున్నట్టు ఫార్మాస్యూటికల్ కంపెనీ జైడస్ కాడిలా బుధవారం తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో జైకోవ్-డి సురక్షితంగా ఉందని కంపెనీ తెలిపింది.

Lupin Launches Covihalt tablets into market