Thursday, April 18, 2024

ఎల్.వి.ప్రసాద్ సినిమానే జీవితంగా మార్చుకున్నారు

- Advertisement -
- Advertisement -

LV Prasad

 

మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా ఎంతో పేరు తెచ్చుకున్న ఎల్.వి.ప్రసాద్ 112వ జయంతి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, రాష్ట్ర ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేష్ ప్రసాద్, ఆయన తనయురాలు శ్రీమతి రాధ, ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఎండి కొవ్వూరి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. “తాను సంపాదించినదంతా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి ఖర్చు చేసిన మహనీయుడు ఎల్.వి.ప్రసాద్. అంతే కాకుండా ఆయన భారతదేశం గర్వించదగ్గ ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్‌ని స్థాపించారు.

ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాదు నేను ఇండస్ట్రీలో నిలబడటానికి ఆయన కారణమయ్యారు. అప్పట్లో ‘చిలకా గోరింక’ సినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ వదిలేసి తిరిగి వెళ్లిపోదామనుకున్నాను. అదే సమయంలో ’నేనంటే నేనే’ సినిమా కోసం డూండీ నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో కృష్ణ, నాగభూషణం రెండు పాత్రలు చేస్తున్నారు. మూడో పాత్ర కోసం నన్ను అడిగారు. అది కొంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కావడంతో నేను అంగీకరించలేదు. ఆ సమయంలో ఎల్.వి.ప్రసాద్‌ని కలవడంతో… నన్ను ఆ క్యారెక్టర్ చేసేలా హితబోధ చేశారు. దీంతో ‘నేనంటే నేనే’ చిత్రంలో నేను నటించాను.

ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆ తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి దోహదపడిన ఎల్.వి.ప్రసాద్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను”అని అన్నారు. ఎల్.వి.ప్రసాద్ తనయుడు ఎ.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “నా జీవితంలో మా నాన్నగారితో గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ఆయనకి పని తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ముఖ్యంగా సినిమానే ఆయన జీవితంగా మార్చుకున్నారు. ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, కృష్ణ, కృష్ణంరాజు అంటే చాలా ఇష్టపడేవారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2006లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది”అని చెప్పారు.

LV Prasad 112th Jayanti
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News