Tuesday, April 16, 2024

యురీలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి చైనా ఎం-16 రైఫిల్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

 

3 terrorist killed in Uri

శ్రీనగర్: యురీలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక చర్యలో గురువారం మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల నుండి భద్రతా దళాలు చైనా తయారు చేసిన ఎం-16 అసాల్ట్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి.  సైన్యం  ఈ రికవరీని “అసాధారణమైనది”గా అభివర్ణించింది. యురీలోని కమల్‌కోట్ ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి హతమైన పాక్ ఉగ్రవాదుల నుంచి  రెండు ఏకే సిరీస్‌ ఆయుధాలు, ఒక చైనా ఎం-16 ఆయుధం, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం వెల్లడించింది.

“సాధారణంగా, మేము ఏకే సిరీస్ , కొన్ని సమయాల్లో, ఎం-4 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకుంటాము. ఈ ఎం-16 చైనీస్ తయారు చేసిన 9-ఎంఎం క్యాలిబర్ ఆయుధం. ఇది అసాధారణమైన రికవరీ” అని ఆర్మీ యొక్క జనరల్ ఆఫీసర్ కమాండింగ్,  ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో 19వ పదాతిదళ విభాగం మేజర్ జనరల్ అజయ్ చంద్‌పురి విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అయితే, ఇది పాకిస్తానీ సైన్యం, ఉగ్రవాదులు , చైనా సైన్యానికి మధ్య సంభావ్య బంధాన్ని సూచిస్తుందో లేదో చెప్పడం ఇప్పుడే చెప్పడం సరికాదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News