Home తాజా వార్తలు గిన్నిస్‌లోకి మహా బతుకమ్మ

గిన్నిస్‌లోకి మహా బతుకమ్మ

Bathukamma4హైదరాబాద్: ఎబి స్టేడియంలో రూపుదిద్దుకున్న మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డులోకి చోటుసంపాదించుకుంది. కేరళ ఓనం పండుగ రికార్డును మహా బతుకమ్మ బ్రేక్ చేసింది. యావత్ ప్రపంచమే మురిసిపోయేలా మహాబతుకమ్మ కనువిందు చేస్తోంది. 20 అడుగుల ఎత్తుతో తీరొక్క పూలతో మహా బతుకమ్మను మహిళలు పేర్చారు. పది వేల మంది మహిళలు పాటలు పాడుతూ, కోలాటాలు, నృత్యాలు చేస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఒక్కో వరుసలో రెండు వేల మంది మహిళలు ఉన్నారు. మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్‌లో చోటుసంపాదించుకోవడంతో మహిళలు ఉద్వేగంతో చప్పట్లు కోట్టారు. చప్పట్ల మోతతో ఎల్‌బి స్టేడియం మార్మోగిపోయింది. బతుకమ్మ పండుగ ముందు వర్షం సైతం తలవంచిందని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… మహా బతుకమ్మ గిన్నీస్ రికార్డు సాధించడం గర్వకారణమని కొనియాడారు.