Saturday, April 20, 2024

విరాట్‌కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

Madame Tussauds unveils Kohli wax statue

దుబాయిలో మైనపు విగ్రహం ఏర్పాటు

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ సంస్థ దుబాయిలోని తమ మ్యూజిలంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న కోహ్లికి తమవంతు గౌరవంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు. కాగా, టీమిండియా జెర్సీలో కోహ్లి విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక యుఎఇ వేదికగా ట్వంటీ20 ప్రపంచకప్ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దీన్ని ఏర్పాటు చేశారు. కోహ్లికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కాగా మేడమ్ టుస్సాడ్ సంస్థ కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. గతంలో 2019 వన్డే ప్రపంచకప్‌ను పురస్కరించుకుని లండన్‌లోని లార్డ్ మైదానంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఉన్న మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సందర్శనకు ఉంచారు. తాజాగా దుబాయిలో కూడా కోహ్లి మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News