Home తాజా వార్తలు కానిస్టేబుల్ నుండి సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయికి…

కానిస్టేబుల్ నుండి సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయికి…

Maddi Manohar

 

ముస్తాబాద్ : తాజాగా ప్రకటించిన ఎస్‌ఐ జాబితాలో టిఎస్‌ఎస్‌పి ఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యాడు మద్ది మనోహర్. పేదరికం నుండి వచ్చిన మనోహర్ రెడ్డి తన బాల్యం నుండే ఎన్నో అవరోదాలను ఎదుర్కొన్నాడు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో 2012లో కానిస్టేబుల్‌కి ఎంపికయ్యాడు. తాజాగా ప్రకటించిన ఎస్‌ఐల జాబితాలో మనోహర్ టిఎస్‌ఎస్‌పి ఎస్‌ఐగా ఎంపికవడంతో తన స్వగ్రామం అయిన ఇల్లంతకుంట మండలం ముస్తానిపేట గ్రామస్థుడైన మనోహర్‌ని పలువురు అభినందిస్తున్నారు. కష్టపడి చదివితే ఎంతటి పదవులైన మనల్ని వరిస్తాయని మనోహర్ అన్నాడు. ప్రస్తుతం మనోహర్ ముస్తాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

 

Maddi Manohar was Elected as TSSP RSI