Friday, April 19, 2024

యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మధుయాష్కీ

- Advertisement -
- Advertisement -

Madhu Yashki Goud Visits Yadadri Temple

హైదరాబాద్: నూతనంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత తొలిసారి మధుయాష్కీగౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ ఇంటి దైవమైన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ గ్రామస్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కలిసి పార్టీని బలోపేతం చేయాలని రాహుల్‌గాంధీ ఆదేశించారన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే ఇక్కడ జిల్లా కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేయకుండా పోరాడుతున్న కార్యకర్తలను అభినందించారు.

అభివృద్ధి, ఆలయ నిర్మాణ పనుల పేరు మీద చిన్న చిన్న వ్యాపారుల షాపుల, గరిబోళ్ల ఇల్లు కూలగొట్టి వారికి ప్రత్యామ్నాయం కూడా ఏమి చూపించకుండా ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడ్తోందని విమర్శించారు. ఇదే అంశంపై న్యాయనిపుణుల సలహాతో కమిటీ ఏర్పాటు చేసి హైకోర్టుకు వెళ్తామన్నారు. వనపర్తిలో దళిత సోదరి లావణ్య కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితులపై దాడులు పెరిగినై, దళిత ఆఫీసర్లను అవమానిస్తూ వారికి ప్రమోషన్స్ ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ అగ్రకులాల వారికి పెద్ద పీట వేస్తూ కింది వర్గాల వారిని అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 9వ తేదీన దళిత, గిరిజన దండోరా మొదలవుతుందని దళిత గిరిజనులను ఎలా తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారన్నది ఇంద్రవెళ్లి దళిత గిరిజన దండోరా ద్వారా ప్రజల్లోకి వస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఎంపిపి శ్రీశైలం, ఆలేరు కాంగ్రెస్ నాయకులు భరత్‌గౌడ్, కిరణ్, అంజయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News