Home జాతీయ వార్తలు మధ్యప్రదేశ్ మాజీ సిఎం బాబులాల్‌ గౌర్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్ మాజీ సిఎం బాబులాల్‌ గౌర్‌ కన్నుమూత

Babulal Gaurభోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం, బిజెపి అగ్రనేత బాబులాల్‌ గౌర్‌(89) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయకు గుండెపోటు వచ్చింది. వెంటనే నర్మదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2004 నుంచి 2005 వరకు ఆయన మధ్యప్రదేశ్ సిఎంగా పని చేశారు. గోవిందపురం నుంచి పది సార్లు ఎంఎల్ఎగా గెలుపొందారు. బాబులాల్ 1930 జూన్ 2న యుపిలోని ప్రతాప్ గఢ్ లో జన్మించారు. అనంతరం ఆయన మధ్యప్రదేశ్ లో స్థిరపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బలమైన నేతగా ఆయన ఎదిగారు. ఆయన కార్మిక సంఘాల నేతగా కూడా పని చేశారు. బాబులాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బిజెపి ప్రముఖులు పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభతి తెలిపారు.

Madhya Pradesh Ex CM Babulal Gaur Passed Away