Wednesday, April 24, 2024

మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..

- Advertisement -
- Advertisement -

Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

విశేషానుభవాల యుపికా లాల్జీ… మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి 
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85 సంవత్సరాల టాండన్‌కు ఇటీవలే శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతోమేదాంత ఆసుపత్రిలో చేర్పించారు.జ్వరం, మూత్ర విసర్జన సమస్యలతో బాధపడుతూ ఆయన మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారని ఆయన కుమారుడు ప్రస్తుతం యుపి మంత్రి అయిన అశుతోష్ టాండన్ తెలిపారు. లాల్జీటాండన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారని, పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు గుండెపోటు కూడా రావడంతో తట్టుకోలేక పొయ్యారని ఆసుపత్రి డైరెక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు.ఆయన కోలుకునేలా చేసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. లోక్‌సభ మాజీ ఎంపి అయిన టాండన్ గత ఏడాది జులై 29వ తేదీన మధ్యప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన 11 నెలల పాటు బీహార్ గవర్నర్ పదవిలో ఉన్నారు. టాండన్ భౌతికకాయాన్ని హజరత్‌గంజ్‌లోని అధికారిక నివాసంలో ఉంచారు. తరువాత సింధీ తోలాలోని సొంత ఇంటికి తరలించారు. పలువురు అక్కడికి వచ్చి నివాళులు అర్పించిన తరువాత మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో పాటించాల్సిన అన్ని నిబంధనల నడుమ అంత్యక్రియలు జరిగాయి.

వాజ్‌పేయి,అద్వానీ సమకాలీన నేత

ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో లాల్జీటాండన్ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన అటల్‌బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానా వంటి ప్రముఖ నేతల తరం వారు. మంచి పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. యుపి, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఆయన రాజకీయంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాల తరబడి కీలక పాత్ర పోషించారు. లాల్జీ యుపి అంతటా చిరపరిచిత వ్యక్తిగా ఎదిగారు.

ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరభారతంలోనే తనకు అంటూ టాండన్ ప్రత్యేకతను సంతరించుకున్నారని, సమాజ సేవకు అలుపెరగని విధంగా పాటుపడ్డారని పలువురు ప్రముఖులు స్పందించారు. టాండన్ ప్రజానేత అని, అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సమాజసేవకు అంకితం అయిన వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని మోడీ తమ సంతాప సందేశంలో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి బలోపేతానికి టాండన్ కీలక పాత్ర పోషించారని గుర్తుం చేశారు. ఎప్పుడూ ప్రజాసేవలో ముందడటం టాండన్ లక్షణం అన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తమ సంతాప సందేశంలో లాల్జీ టాండన్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. అదే విధంగా లక్నో అభివృద్దికి పాటుపడ్డారని తెలిపారు. లక్నో ఎంపి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంతాప సందేశాలు వెలువరించారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి ,పలు రాష్ట్రాల గవర్నర్లు టాండన్‌కు నివాళులు తెలిపారు. రాష్ట్రంలో మూడురోజుల సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు యుపి ప్రభుత్వం ప్రకటించింది.

Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News