Home జాతీయ వార్తలు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

Madhya Pradesh Governor Health Condition Is Criticalభోపాల్‌ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో లక్నోలోని మెదాంత ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం పూర్తిగా పాడై పోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని మెదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్ మెడిసిన్ వైద్యుల పర్యవేక్షణలో లాల్జీ టాండన్ కు వైద్యం అందిస్తున్నట్టు రాకేశ్ కపూర్ వెల్లడించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు పైపు ద్వారా ఆహారం అందించారు. దీంతో కోలుకున్న లాల్జీ ఆరోగ్యం మళ్లీ విషమించడంతో మెదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాకేశ్ పేర్కొన్నారు.