Saturday, April 20, 2024

దోచుకునే వారే.. కరోనా వ్యాక్సిన్‌ను దాచిపెట్టారు..

- Advertisement -
- Advertisement -

Madonna sharing Corona conspiracy theory on Instagram

లండన్: కరోనా వ్యాక్సిన్ లోగుట్టు గురించి పాప్ బ్యూటీక్వీన్, డాన్సర్ మడోనా ఓ సంచలన వ్యాఖ్య చేశారు. తాను చెపుతున్నది కరోనా వైరస్ కుట్ర సిద్థాంతం అని డైరెక్టర్, సాంగ్ రైటర్‌గా కూడా పేరున్న మడోనా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోతో పాటు ఈ థియరీని ఆమె పోస్టు చేశారు. కోటికి పైగా ఉన్న ఆమె ఫాలోయర్స్‌కు ఈ ట్వీటు సంచలనమే అయింది. ఇప్పటికే కరోనా వైరస్‌కు సరైన వ్యాక్సిన్ వచ్చిందని, అయితే దీనిని రాలేదని కప్పిపుచ్చుతున్నారని మడోనా తెలిపింది. వ్యాక్సిన్ ఎప్పుడో కనుగొన్నారు. అయితే గుత్తాధిపత్య ధోరణికి అలవాటు పడ్డ దేశాల అధినేతలు వారి కనుసన్నల్లో మెలిగే కంపెనీల వారు ఈ వ్యాక్సిన్ ఆవిష్కరణ అంశాన్ని రహస్యంగా ఉంచారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు మరింత సంపన్నులు కావాలని, పేదలు మరింత పేదలు కావాలనేదే ఈ వ్యక్తుల అసలు లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను మడోనా మెరిపించారు. వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉధృతిని చూపింది.

అప్పటివరకూ ముందుకు దూసుకుపోతున్న వర్గాలు, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్న దేశాలు వైరస్ ఉన్నట్లుండి పిడుగుపాటును సృష్టించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని మడోనా తెలిపారు. సంపన్న వర్గాలకు ఇతరులు ఎవరూ తమవైపు కనీసం చూడనంత స్థాయిలో దిగజారి ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఈ మేరకు వారు వ్యాక్సిన్ రూపొందినా దీని గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని ఈ పోస్టులో తెలిపారు. తరువాత దీనిని తొలిగించారు. ఇంతకు ముందు చెప్పింది తప్పుడు వాదన అని కూడా పేర్కొన్నారు. దీనితో మడోనా విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత వివాదాస్పద అంశంతో సెలిబ్రిటీల వ్యవహార శైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి. నిజాలకు, కరోనా మహమ్మారి పరిస్థితితో ఆటలాడుకుంటున్న వైనానికి మధ్య ఘర్షణ నెలకొన్నట్లు అయింది.

అంతకు ముందు రేసర్ లూయిస్ హమిల్టన్ కూడా ఇటువంటి పోస్టుతోనే వివాదంలో చిక్కారు. కరోనా వ్యాక్సిన్ గురించి బిల్‌గేట్స్ అబద్ధాలు చెపుతున్నారని వాఖ్యానించారు. ఇది వివాదాస్పదం అయింది. ఫార్మూలా ఒన్ డ్రైవర్ అయితే హమిల్టన్ షేర్ చేసిన వీడియో ఏకంగా రెండు కోట్ల మంది ఫాలోయిర్స్ వద్దకు వెళ్లింది. వ్యాక్సిన్ ఏదైనా ఫర్వాలేదని, వాటిని వాడితే మనిషిలో ఏదో విధంగా ఇమ్యూనిటీ ఏర్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పారని మనషి శరీరంలో ఈ వ్యాక్సిన్‌లు మైక్రోచిప్స్‌ను కల్గిస్తాయని వ్యాఖ్యానించారు. బిల్‌గేట్స్ దీనిని ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోస్టుపై నిరసన వ్యక్తం అయింది. తరువాత దీనిని హమిల్టన్ తన బ్లాగ్ నుంచి తీసేశారు. మరికొందరు సెలబ్రిటీలు కరోనావైరస్‌కు 5 జి టెక్నాలజీకి సంబంధం ఉందని తెలిపారు. ఇక యాక్టర్ ఎవన్‌గెలిన్ లిల్లీ తమ పోస్టులో కరోనా దశలో భౌతిక దూరం పాటించడం అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ఈ విధంగా పలు వరుస స్పందనల మధ్య ఇప్పుడు మడోనా వ్యాఖ్యలు వెలువడ్డాయి.

Madonna sharing Corona conspiracy theory on Instagram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News