Home జాతీయ వార్తలు జయలలిత ఇంటి విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురు

జయలలిత ఇంటి విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురు

Madras HC Verdict on Ex CM Jayalalithaa's House

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత పోయస్ గార్డెన్ నివాస భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోడాన్ని మద్రాస్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. తమిళనాడు ప్రభుత్వం జయలలిత నివాసాన్ని సాధీనం చేసుకోబూనడాన్ని ఆమె వారసులైన మేనల్లుడు జె దీపక్, మేనకోడలైన దీపా కోర్టులో సవాలు చేయడంతో కోర్టు ఆ స్వాధీనాన్ని రద్దు చేసింది. ఇదివరకటి ఎఐఎడిఎంకె ప్రభుత్వం వేద నిలయం అనే ఆ గృహాన్ని రాష్ట్ర దిగ్గజ ముఖ్యమంత్రి జయలలిత స్మారకంగా మారుస్తామని ప్రతిపాదించింది. జయలలిత గృహాన్ని స్మారకంగా మార్చడం అన్నది తమిళనాడు ప్రజల, ఎఐఎడిఎంకె పార్టీ కార్యకర్తల అభీష్టమని కూడా ఎఐడిఎంకె తెలిపింది. జయలలిత చనిపోయాక ఆమె పార్టీలోని రెండు వర్గాలు కూడా జయలలిత గృహాన్ని స్మారకంగా రూపొందించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో పళనిస్వామి ముఖ్యమంత్రి కాగానే జయలలిత ఇంటిని స్మారకంగా మారుస్తానని ప్రకటించారు. 0.55 ఎకరాల ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకుగాను తమిళనాడు ప్రభుత్వం రూ.67.9కోట్లను 2020 జులైలో సిటీ కోర్టులో డిపాజిట్ చేసింది. కానీ జయలలిత వారసులైన మేనల్లుడు, మేనకోడలు ఆ స్వాధీనత అన్నది ఆస్తి కబ్జాగా మారుతుందంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.

Madras HC Verdict on Ex CM Jayalalithaa’s House