Home తాజా వార్తలు ‘మాస్ట్రో’ను బాగా ఎంజాయ్ చేస్తారు

‘మాస్ట్రో’ను బాగా ఎంజాయ్ చేస్తారు

Maestro movie pre release event

 

నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’అందాధున్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, కాసర్ల శ్యామ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్ కుమార్ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ “దర్శకుడు మేర్లపాక గాంధీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమా తీశారు.

హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అంత మంచి ఆర్‌ఆర్‌ను థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను, గాంధీ చాలా ఫీలయ్యాం. కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం. ఈ సినిమాలో తమన్నా చక్కగా నటించారు. ఈ సినిమా ఈనెల 17న హాట్ స్టార్‌లో రాబోతోంది” అని అన్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ “ఈ సినిమాలో నితిన్ బాగా చేశారు. ఈ సినిమాతో తమన్నాను గ్రేట్ ఆర్టిస్ట్ అని అంటారు. నభా కూడా అద్భుతంగా నటించారు. మంగ్లీ, జిషు సేన్ గుప్తా, రచ్చ రవి, శ్రీముఖి ఇలా ప్రతి ఒక్కరూ బాగా నటించారు. మహతి స్వరస్వాగర్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు” అని తెలిపారు. తమన్నా మాట్లాడుతూ “నితిన్‌తో మంచి లవ్ స్టోరీ చేస్తానని అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.

Maestro movie pre release event