Thursday, April 25, 2024

మాఘస్నానం మహిమాన్వితం

- Advertisement -
- Advertisement -

Magha-Amavasya

మాఘమాసం శైవ వైష్ణవులిద్దరికీ పవిత్రమైనది. కార్తీకమాసంలో చేసే ఉపవాసం ఎంత పుణ్యాన్నిస్తుందో అంతే ఫలితం మాఘస్నానం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చెరువులు, నదులు, కాలువలు, సముద్రాల వద్ద భక్తులు మాఘ స్నానం చేస్తుంటారు. ఈ మాసంలో తెల్లవారుజామునే చేసే స్నానానికి అత్యంత విశిష్టత ఉంది. నదిలో మూడు మునకలు వేసి సూర్యునికి అర్ఘమిస్తే పుణ్యం లభిస్తుందని ప్రజల నమ్మకం. పూర్ణిమ నాడు చేసే స్నానం మరింత మహిమ గలదట. సముద్ర స్నానం వల్ల శరీరంలో సరికొత్త విద్యుత్తు ప్రవేశిస్తుంది.దీంతో ఏడాదంతా ఉత్సాహంగా ఉంటామని అంటారు.

మఘ నక్షత్రంలో పూర్ణిమ రావడం వల్ల మాఘమాసమనే పేరు వచ్చింది. ఈ మాసంలో ప్రయోగలో స్నానం , దానం, విష్ణుపూజ, హరికీర్తన చేస్తే కలిగే పుణ్యయోగం గురించి తులసీ దాసు చక్కగా వర్ణించాడు. మాఘమాసంలో సముద్ర స్నానం చేయడం వల్ల విష్ణువుకి ప్రీతిపాత్రులమౌతామట. నల్ల నువ్వులు దానం చేస్తే నరకబాధ ఉండదని చెబుతారు. ఎక్కడ స్నానం చేస్తున్నా ఆ నీరు గంగా జలంతో సమానం. మాఘ అమావాస్య రోజున పితృ దేవతలకు పిండ ప్రదానం, తర్పణాదులను ఇవ్వాలట. పితృకార్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

పవిత్ర స్నానానికి ఓ పురాణ కథ ఉంది. పూర్వం నర్మద నదీ తీరాన సువ్రతుడనే పండితుడున్నాడు. అధిక ధనవంతుడు. కానీ పిసినారి. ఎవ్వరికీ పైసా దానం చేసేవాడు కాడు. ఊరికి ఒక్క ఉపకారమూ చేయలేదు. ఒక రోజు అర్థరాత్రి అతడింట్లో దొంగలు పడి సంపదంతా దోచుకెళ్లారు. ముందు లబోదిబో అన్నా, తర్వాత తన పీనాసితనానికి సిగ్గుపడ్డాడు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. మాఘమాసంలో ప్రతి ఉదయం నదీస్నానం చేయడం వల్ల పాప విముక్తి పొందాడు. పదో రోజు నర్మదలో ప్రాతః కాలం స్నానం చేసి బయటకు రాగానే చలికి బిగుసుకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే మాఘ స్నానం వల్ల దివ్యవిమానం వచ్చి అతణ్ణి స్వర్గానికి తీసుకెళ్లింది. మాఘ స్నానం వల్ల ఉత్తమ గతిని పొందాడు.
(23న మాఘ అమావాస్య)

Magha Amavasya 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News