Thursday, April 25, 2024

వలసల జిల్లా వండర్ రికార్డు

- Advertisement -
- Advertisement -

Mahabubnagar into the Wonder Book of Records

 

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి మహబూబ్‌నగర్

విత్తన భాండాగారం దిశగా అడుగులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చుతామన్న ప్రభుత్వ ప్రకటన క్రమంగా ఫలిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తంలో విత్తన బంతులను తయారు చేసి మహబూబ్‌నగర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏకంగా 14లక్షల 88వేల 61 విత్తనాలను తయారు చేసినందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

రాష్ట్ర అబ్కారి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మదిలొ చిగురించిన ఈ చిన్న ఆలోచన దేశంలోనే వెనుకబడి ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కటంతో ఇపుడు మొత్తం ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఆ జిల్లా ఎదిగింది. సాధారణంగా జిల్లాల రూపు రేఖలను మార్చేస్తామని, నందన వనాలుగా తీర్చిదిద్ధుతామని నేతలు ప్రకటించటం మామూలే అయినా ప్రకటన చేయటం దాన్ని నిజం చేసేందుకు శ్రమించేవారు చాలా అరుదు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్.

తొమ్మిది రోజుల్లో కోటి 14 లక్షల 88oవేల 61 విత్తన బంతులను తయారు చేయటమే గాక, వాటిని జిల్లాలోని అటవీ భూములు, బంజరు భూములలో దిగ్విజయంగా చల్లారు. కరవు, వలసల జిల్లాగా పేరుగాంచిన మహాబూబ్‌నగర్ జిల్లాలో అడవులను, అటవీ సాంద్రతను , పంటలు, భూగర్భ జలాల మాట్టాలను పెంచుకునే వీలు కల్గింది. దీంతో పాటు జిల్లాలోని 284 గ్రామ సమాఖల స్వయం సహాయక బృందాలకు చెందిన 69వేల 200మంది మహిళలు డిఆర్‌డిఎ ఆధ్వరంలో చింత, సీతాఫలం, నెమలి నార, వేప వంటి విత్తనాలతో ఈ విత్తన బంతులను తయారు చేశారు.

ప్రజాప్రతినిధుల చొరవ, స్థానికుల శ్రమను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు గుర్తించి జిల్లాకు అరుదైన గౌరవాన్నిచ్చారు. ఈ విత్తన బంతుల తయారీని వండర్ బుక్‌లో నమోదు చేశారు. ఈ విజయం సాధించటయ పట్ల రాష్ట్ర అబ్కారి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, కలెక్టర్‌ను స్థానిక ప్రజాత్రినిధులు అభినందించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాధించిన ఈ అరుదైన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని, ఇలాంటి విధానాల్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేసి, అందులో ప్రజలను భాగస్వాములను చేయగలిగితే రాష్ట్రం విత్తన భాండాగారంగా మారటం ఖాయమన్న వాదనలు విన్పిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News