Wednesday, April 24, 2024

మహారాష్ట్ర అమరావతిలో నాలుగు రోజుల కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

Maharashtra Amravati city four-day curfew

అమరావతి (మహారాష్ట్ర) : మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో బంద్ సందర్బంగా హింస చెలరేగడంతో శనివారం తెల్లవారు జాము నుంచి నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అంతకు ముందు రోజు త్రిపుర, నాందేడ్, మాలెగావ్, వాషీం, యావత్మాల్ జరిగిన సంఘటనలకు నిరసనగా ముస్లింల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని నిరసిస్తూ అల్లరి మూకలు షాపులపై రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక సంఘటనలు శుక్ర, శనివారాల్లో జరిగాయి. వదంతుల వ్యాప్తితో హింసను ప్రేరేపించడమౌతుందని, దాన్ని అరికట్టడానికి మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్తి సింగ్ తెలిపారు. శనివారం ఉదయం వందలాది మంది కాషాయ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ రాజ్‌కమల్ చౌక్ ఏరియా వీధుల్లో తిరిగారు. వీరిలో కొందరు షాపులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News