హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో మజ్లిస్ అభ్యర్థుల ప్రకటనల జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే దశల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఆఖరి గడువుగా ఉంది. ఈ నేపథ్యంలో మజ్లిస్, అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ఎన్నికల ప్రచారం కార్యక్రమాలలో పాల్గోంటున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యా పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. గత రెండు రోజులుగా పలు అసెంబ్లీ నియోజక వర్గాలలో పరిధిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
శుక్రవారం ముంబాయిలోని అందేరి తదితర ప్రాంతాలో జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు విడుల చేసిన ప్రకటనలో తెలిపాయి. అలాగే మరో 10 స్థానాల అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తారని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికలలో 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపగా, రెండు అసెంబ్లీ స్థానాలను మజ్లిస్ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో తొలి సారి ఔరంగాబాద్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మజ్లిస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.