Home జాతీయ వార్తలు బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై సమీక్ష: సిఎం థాకరే

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై సమీక్ష: సిఎం థాకరే

Uddhav-Thackeray

 

ముంబై: రాష్ట్రంలో ముంబైఅహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుతోసహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ధాకరే ఆదేశించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు రైతులు, గిరిజనుల భూముల సేకరణ కారణంగా వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజది. ప్రజలు అడుగుతుండడంపై తాము సమీక్ష నిర్వహిస్తాం. ఆరే కారు షెడ్ మాదిరిగానే బుల్లెట్ రైలు ప్రాజెక్టును కూడా ఆపుతాం అని థాకరే ఆదివారం రాత్రి పాత్రికేయులతో అన్నారు. రాష్ట్రం లోని ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభుత్వం శ్వేత పత్రం సమర్పిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తుందని చెప్పారు. శివసేన ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల నెత్తిపై బుల్లెట్ రైలు ప్రాజెక్టు భారం మోపడానికి తమ పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు.

Maharashtra government to review bullet train project