Thursday, April 18, 2024

మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సమ్మె హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Doctor

ముంబయి: మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం(ఎంఎఆర్‌డి) ప్రభుత్వం  తమ డిమాండ్లను మన్నించకపోతే వచ్చేవారం నుంచి సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల ట్యూషన్ ఫీజు రద్దు, కోవిడ్ ఇన్సెంటివ్స్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర వైద్య విద్యా మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ ఫీజు రద్దు చేస్తానని గత నెల హామీ ఇచ్చినప్పటికీ ఇంకా అమలుచేయలేదు. రెసిడెంట్ డాక్టర్ల ప్రతినిధి బృందం తమ డిమాండ్లతో ఆగస్టు నెలలోనే దేశ్‌ముఖ్‌ను కలిశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే వారం నుంచి సమ్మెకు దిగుతామని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రణవ్ జాదవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News