Home ఎడిటోరియల్ సుందర సురక్షిత నగరాలేవీ?

సుందర సురక్షిత నగరాలేవీ?

Mahatma Gandhi said real india lives in its villages

 

పౌర సమాజం మానసికంగానూ, భౌతికంగానూ అత్యంత క్షేమకరంగా, ఆనంద దాయకంగా నివసించ గలిగే భూభాగాన్ని ‘జీవన యోగ్యతా ప్రాంతం’గా ఐక్యరాజ్య సమితి నిర్వచించింది. ప్రపంచంలోని ఇరవై అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో పదకొండు నగరాలు మన దేశంలోనివే కావడం, ఇవి తమ పర్యావరణాన్ని, నదులను, అడవులను దారుణంగా క్షీణింపజేస్తూ విషపూరితంగా విస్తరిస్తున్నాయన్న వాస్తవాన్ని యుఎన్‌ఎల్‌ఐ -2021 చెబుతోంది. మనం గొప్పలుపోతున్న దేశంలోని ప్రధాన నగరాలన్నీ జీవనయోగ్యతా సూచీ (140 దేశాలు) లో డెమాస్కస్ (సిరియా రాజధాని) తో పోటీపడుతూ సరి సమానంగా అట్టడడుగున ఉన్నాయి. దేశంలో విడుదలయ్యే కర్బన, రసాయనాల కాలుష్యంలో 40 శాతాన్ని మన నగరాలు వివిధ పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్నాయి. విభిన్న ఉత్పత్తుల పేరు మీద పారిశ్రామిక వాడలు శకలాలు శకలాలుగా విసరబడి నగరాల శివార్లలో వికారాలను పుక్కిలిస్తుంటాయి.

‘ఇండియా లివ్స్ హర్ విలేజెస్’ అనేది వందేళ్ల కిందట గాంధీ మహాత్ముడన్న మాట. నూటికి తొంబై మంది అప్పు ట్లో గ్రామాల్లోనే నివసించేవారు. ఇప్పుడంతా రివర్స్. పల్లె పట్టుల్ని వదిలి పట్టణాల్లో, నగరాల్లో జనాభా స్థిరపడటం నానాటికీ పెరుగుతూవస్తోంది. దీని మూలంగానే గత రెండు దశాబ్దాలుగా చూస్తే నగరాల విస్తీర్ణం ఊహించనంతగా హెచ్చింది. విద్య, వైద్యం, జీవనోపాధి, వ్యాపారం, నిర్మాణ రంగం, పారిశ్రామిక ఉత్పత్తులు, సేవారంగంలో మానవ వనరుల అవసరం ఇత్యాది కారణాల రీత్యా పట్టణాలు నగరాల్లో బతికేందుకు జనం వరుస కడుతున్నారు.మనకు 1970లలో కలకత్తా, బొంబాయి రెండే అధిక జనసాంద్రత కలిగిన నగరాలుగా ఉండేవి. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పుణె దేశంలోకెల్లా అత్యధిక పెద్ద జనాభా కలిగిన పది నగరాల జాబితాలో వరుసగా పెద్ద నగరాలు. దేశంలోని మరో వంద నగరాల్లో జనాభా వాటి భౌగోళిక స్తోమతకు మించి పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2036 నాటికి మన దేశ జనాభాలో మూడో వంతు ప్రజానీకం పట్టణా ల్లో నగరాల్లో స్థిరపడతారని, 2046 నాటికి ఇది 39 శాతానికి చేరనున్నట్టు తెలుస్తుంది.

అయితే ప్రజలకు తమకు ఇష్టమైన చోట దేశంలో ఎక్కడైనా నివాసం ఉండే హక్కు ఉంది. దీన్నెవరూ కాదనలేరు. వచ్చిన చిక్కల్లా ఎమంటే? తాము తరలి వెళ్తున్న పట్టణాలు, నగరాలు జీవన యోగ్యత (Livable) కలిగి ఉన్నాయో లేదో ప్రజానీకానికి తెలియదు. జీవన యోగ్యత కొరవడిన నగరాలకు వలసవెళ్తే ముఖ్యంగా సగటు మనుషుల గతి మహాభాగవత పురాణంలో మొసలి నోటికి చిక్కిన ఏనుగు చందమే మరి. కృత్రిమ అభివృద్ధి జడలు విప్పుతున్న దరిమిలా ప్రపంచంలోని చాలా నగరాలతో పాటు, మన నగరాలు కూడా జీవన విధ్వంసానికి అతి సమీపాన, జీవ వైవిధ్యానికి బహు దూరాన ఉన్నట్టు ‘ఐక్యరాజ్య సమితి జీవన యోగ్యతా సూచీ (United Nations Livea bility Index) -202’ జాబితాను పరిశీలిస్తే తెలిసిరాగలదు. పౌర సమాజం మానసికంగానూ, భౌతికంగానూ అత్యంత క్షేమకరంగా, ఆనంద దాయకంగా నివసించ గలిగే భూభాగాన్ని ‘జీవన యోగ్యతా ప్రాంతం’ గా ఐక్యరాజ్య సమితి నిర్వచించింది. ప్రపంచంలోని ఇరవై అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో పదకొండు నగరాలు మన దేశంలోనివే కావడం, ఇవి తమ పర్యావరణాన్ని, నదులను, అడవులను దారుణంగా క్షీణింపజేస్తూ విషపూరితంగా విస్తరిస్తున్నాయన్న వాస్తవాన్ని యుఎన్‌ఎల్‌ఐ -2021 చెబుతోంది.

మనం గొప్పలుపోతున్న దేశంలోని ప్రధాన నగరాలన్నీ జీవనయోగ్యతా సూచీ (140 దేశాలు) లో డెమాస్కస్ (సిరియా రాజధాని) తో పోటీపడుతూ సరి సమానంగా అట్టడడుగున ఉన్నాయి. దేశంలో విడుదలయ్యే కర్బన, రసాయనాల కాలుష్యంలో 40 శాతాన్ని మన నగరాలు వివిధ పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్నాయి. విభిన్న ఉత్పత్తుల పేరు మీద పారిశ్రామిక వాడలు శకలాలు శకలాలుగా విసరబడి నగరాల శివార్లలో వికారాలను పుక్కిలిస్తుంటాయి. పనులు- దినచర్య, వినోదం, క్రీడలు, విద్యుత్తు, రవాణాకు సంబంధించి ఆయా సంస్థల మధ్య సమన్వయ లోపం నగరాల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి కొన్ని నగర పాలక వ్యవస్థలు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్న పరిస్థితిని సైతం ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. లండన్‌కు చెందిన ఆర్థిక మేధో సంఘం ( Economist Intelligence Unit) ప్రతి యేటా ప్రకటించే’ జీవన యోగత్యతా సూచీ’ లో జనాభాకు సంబంధించి ‘స్థిరత్వం (Stability), ఆరోగ్యావగాహన (Heal th Care), విద్య (Education), మౌలిక వసతులు (Infrastructure), సంస్కృతి (Cul ture), పర్యావరణం (Environment)’ అనే ఆరు అంశాలు కీలక పాత్ర వహిస్తాయి. ఈ ఆరు పారామీటర్స్‌లో పైనపటారం లోన లొటారం అన్న మాదిరిగా మన దేశంలోని నగర వాసుల జీవనం అస్తవ్యస్తంగా గడుస్తోందని అంతర్జాతీయ జీవనయోగ్యతా సూచీ మరీ నొక్కి చెబుతోంది.

బడా వ్యాపారుల, గ్లోబల్ పెట్టుబడిదారుల, వ్యాపార సామ్రాజ్యానికి అడ్డాగా మాత్రమే నేడు నగరాలు పట్టణాలు రూపుదిద్దుకుంటున్నాయే తప్ప ’సార్వత్రిక సురక్షిత జీవన ధామాలు’గా ఎంత మాత్రం మన్నిక కలిగిలేవు అనేది యుఎన్‌ఎల్‌ఐ-2021 చెబుతున్న నిష్ఠూర సత్యం. రియల్టర్ల బ్రోచర్లలో కనిపించే రంగులు, హంగులు నగిషీ నగరాల వాస్తవ ముఖంలో మచ్చుకైనా అగుపించవు. వికలమైన రోడ్లు, అడ్డంగా ప్రవహించే నీటి దుంగలు, డ్రైనేజ్ దురవస్థ, వీధి దీపాల కునుకుపాట్లు, సంవత్సరం పొడవునా వుండే తాగునీటి కొరత అనే ఐదు ప్రధాన సమస్యల (బిగ్ ఫైవ్ ప్రాబ్లమ్స్) కు మన నగరాలు చిరునామాగా మారాయని ఆర్థిక మేధో సంఘం అభిప్రాయ పడుతోంది. దీన్ని బట్టి ‘స్మార్ట్ ’అన్నది నామ్ కే వాస్తే అని, మనవి ఉత్త ‘మార్ట్ సిటీస్ (అంగడి నగరాలు)’ గానే బయటి దేశాల్లో ముద్రపడ్డాయి. భరింపనలవికాని వక్రతల నగర జీవికనుద్దేశించిన ‘జర భద్రం కొడుకో’ అనే పాట, ‘రంగులకల’ సినిమా మన జ్ఞాపకంలోనే వుంది. పర్యావరణ పరిరక్షణను ప్రబోధించే అమెరికన్ సుప్రసిద్ధ డాక్యుమెంటరీ ‘యాన్ ఇన్కన్వీనెంట్ ట్రూత్’ రూపుకట్టించిన ప్రమాదాలు మనం నిత్యం ఎదుర్కొంటున్నవే. ‘నగరాలు నల్లబజార్లు’ అనే నానుడి ప్రాసంగికతకు నేటి మన మేటి నగరాలు మరింత పరిపోషకాలుగా మారి, పరిస్థితిని ఇప్పుడొకింత రెట్టింపే చేస్తున్నాయి. తమ ధూళిదూసరిత ముఖాలపై సామాన్యులకు సైతం మోహాన్ని రాజేస్తూ సరికొత్త భ్రమల చాటున జీవన సంక్లిష్టతలను దాచి అన్ని విధాలా మానవాళిని దగా చేస్తున్నాయి.

జీవన యోగ్యతా సూచీలో ఈ యేడాది ఉత్తమ నగరాలుగా పది స్థానాలు దక్కించుకున్న 1. ఆక్లాండ్ (న్యూజిలాండ్), 2. ఒసాకా (జపాన్), 3.అడిలైడ్ (ఆస్ట్రేలియా), 4. వెల్లింగ్టన్ (న్యూజిలాండ్), 5. టోక్యో (జపాన్, 6. పెర్త్ (ఆస్ట్రేలియా), 7. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), 8. జెనేవా (స్విట్జర్లాండ్),9. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), 10. బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) నగరాల అర్బన్ నమూనాకు మన దేశంలో జరుగుతున్న పట్టణీకరణకు తీవ్ర వ్యత్యాసం ఉంది. ఇవి నిజంగానే ‘స్మార్ట్ ’నగరాలు. ఈ నగరాలే గత కొన్నేళ్లుగా మొదటి పది స్థానాలను దక్కించుకోవడం చూస్తే అక్కడి నగరాభివృద్ధి మండళ్లు అనుసరించే పర్యావరణ శ్రద్ధ ఎంత శ్రేష్ఠమైందో అర్థమవుతుంది. వీటి నమూనాను మన నగరాభివృద్ధి సంస్థలు అందుకోవట్లేదు. అందుకే మన నగర నిర్మాణం, నవీకరణ, ప్రణాళికలను గురించి ‘మనం సింగపూర్, శాంగై, దుబాయ్ వంటి నగరాల అభివృద్ధి నమూనాలను గుడ్డిగా అనుకరించడం మూలాన చారిత్రక ప్రసిద్ధి గలిగిన మన మహిమాన్విత భారతీయ నగరాలన్నీ రూపు చెడి సర్వభ్రష్టంగా మార్చుకున్నాం.

ఇప్పుడు మనకో నగర నిర్మాణ దార్శనికత కావాలే తప్ప నగరాల్లో గుంతలు పూడ్చడం కాదు’ అంటూ ఢిల్లీకి చెందిన ప్రముఖ నిర్మాణ నిపుణులు శిల్పి గౌతం భాటియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మన నగరాల్లో ఏ ఒక్కటీ ఏ ఒక్క విషయంలోనూ బాగా లేదని కాదు. ప్రజా రవాణాకు అహ్మదాబాద్, పరిశుభ్ర జలాల పంపిణీకి ఉదయ్ పూర్, వ్యర్థాల యాజమాన్యానికి సూరత్, హరితీకరణలో భువనేశ్వర్ , ఐటికి బెంగళూరు, కల్చరల్ ఇంటిగ్రిటీకి హైదరాబాద్ నగరాలు దేశంలోనే ఆదర్శంగా ఉన్నాయి. ఇట్లా ఏదో ఒక విషయంలో మెరుగ్గా ఉండటం కాకుండా అన్నింటా కాంతులీనే ‘సుందర సురక్షిత విశ్వ నగరాలు’ మనకిప్పుడు కావాలె. ఇందుకు నగర పాలక మండళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, చట్టాల కట్టుదిట్టత తోపాటు, వాస్తు శిల్పులు టౌన్ షిప్ ప్లానర్ల సముచిత నిర్ణయాలు, సృజనాత్మకత, జనహిత భావన, ఆర్థిక సంస్థల ఇతోధిక తోడ్పాటు మన నగరాల నవీకరణకు అభివృద్ధికి ఇప్పుడు తక్షణావసరాలు.

Mahatma Gandhi said real India lives in its villages