Home అంతర్జాతీయ వార్తలు గాంధీ విగ్రహం ధ్వసం.. భారత్‌కు సారీ చెప్పిన అమెరికా

గాంధీ విగ్రహం ధ్వసం.. భారత్‌కు సారీ చెప్పిన అమెరికా

Mahatma Gandhi Statue destroyed in America

అమెరికా : అమెరికాలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. నల్లజాతియుడు జార్జ్ ప్లాయిడ్ పట్ల అమెరికా పోలీసులు దాష్టికంగా వ్యవహరించి అతడి చావుకు కారణమయ్యారని ఆరోపిస్తూ అమెరికా వ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నాయి. గత నెల 25న పోలీసుల కస్టడీలో జార్జ్ ప్లాయిడ్ చనిపోయాడు.  నేపథ్యంలో వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ప్లాయిడ్ చావుకు పోలీసులే కారణమంటూ అల్లర్లు, ఆందోళనలు చెలరేగుతుండడంతో అమెరికా అట్టుడికిపోతోంది. ఇప్పటికే 40 నగరాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతో పాటు 13 నగరాల్లో ఎమర్జెన్సీని విధించారు. ఆందోళనకారులు వెనక్కి తగ్గకుంటే శాంతి స్థాపన కోసం ఆర్మీని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉండగా గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. గాంధీ విగ్రహ ధ్వంసంపై అమెరికా విచారం వెలిబుచ్చింది. గాంధీ విగ్రహ ధ్వంసంపై  అమెరికా రాయబారి కెన్ జస్టర్ క్షమాపణలు తెలిపారు.