Thursday, April 25, 2024

ఘనంగా మహాత్మ జ్యోతిరావుపూలే వర్థంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని ఇందిరానగర్ లో మహాత్మ జ్యోతిరావుపూలే 131వ వర్థంతి వేడుకలు సురేందర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రఘువీరా, బత్తుల లక్ష్మణ్, సోమిది మహేందర్, ఆసతి శివకుమార్, బత్తుల ప్రమోద్ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆదివారం మహాత్మ జ్యోతిబాపూలే వర్థంతి వేడుకలు తెజస పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెజస పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతిల్యాడ మోహన్ రెడ్డి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిబాపూలే దంపతులు అణగారిన కులాల అభ్యున్నతికి జీవితం ధారబోశారని, వారి ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, జిల్లా ఉపాధ్యాక్షులు కంతి మోసె ఆనందం, మాజీ ఎంపిటిసి రాజారెడ్డి, మండల తెజస పార్టీ అధ్యక్షులు కంతి రమేష్, వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులు ఒద్దె సోమేష్, బక్కి రాజేష్, గజ్జ రాజేందర్, కర్రోళ్ల శ్రీనివాస్ రెడ్డి,మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వీర్నపల్లి

వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున అంబేద్కర్ విగ్రహం ఎదుట మహాత్మ జ్యోతిరావుపూలే 131వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అసమానతలపై, అంటరానితనంపై, అస్పృశ్యత, కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా సాధికారత కోసం పని చేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గంగాధరి నాంపెల్లి, బిఎస్పీ సెక్టార్ అధ్యక్షుడు కన్నం జనార్థన్, యూత్ కాంగ్రెస్ యువజన ఉపాధ్యాక్షుడు తిరుపతి, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ బాషా, నాయకులు పాటి శ్రీనివాస్, సునీల్, చందు, దినేష్, మాడుగుల రాజం, ప్రశాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News