Home తాజా వార్తలు రైతు శ్రేయస్సేటిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం

రైతు శ్రేయస్సేటిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం

 శివసాగర్ ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేయిస్తా
 రూ.1300 కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు
పత్తి రైతుకు మద్దతు ధర కల్పిస్తాం.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం
దళితుల భూ పంపిణీకీ నిధులున్నాయి
 రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
చేవెళ్లను అభివృద్ధి చేయడమే లక్షం : ఎమ్మెల్యే కాలె యాదయ్య
MAHIచేవెళ్ల/యాలాల : టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిసిఐ ఆధ్వర్యంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్ధతు ధర ప్రకటిస్తూ కొనుగోలు కేంద్రాలను కూడా మార్కెట్ యార్డులు ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే జిల్లాల్లోని చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దళారులను నమ్మి అన్నదాతలు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే సిసిఐ ద్వారా మార్కెట్ యార్డుల్లో పత్తిని కొనుగోళు చేసేందుకు చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేశామని మంత్రి వివరించారు. సిసిఐ రైతుల నుంచి పత్తిని కొనుగోళు చేసి వారికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారానే డబ్బులు చెల్లించేలా చేశామని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరిగే అవకాశలే కుండా పకడ్బంది చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. ప్రభుత్వం పత్తికి రూ. 4100 మద్దతు ధరను చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలపేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చెట్లు రోజు రోజుకు నరికివేతకు గురవడంతోనే మన జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. చెట్లు నరికివేయకుండా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడా సమస్య ఉండేది కాదన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తెలంగాణకు హరితహా రంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలో రోడ్ల అభివృద్దికిగాను రూ. 1300 కోట్ల నిధులను ఆర్‌అండ్‌బీకి, రూ. 700 కోట్లను పంచాయతీరాజ్‌కు కేటాయించి పాడైపోయిన రోడ్లను బాగు చేయిస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గృహావసరాలకు 24 గంటల విద్యుత్, రైతులకు నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ పగటి వేళలో అందిస్తామని చెప్పారు. రైతులకు లక్ష లోపు రుణాల మాఫిని విడతల వారిగా చేశామని తెలిపారు. వృద్దులు, వితంతువులకు 1000, వికలాంగులకు 1500 రూపా యల పింఛన్‌లను అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుం దన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణ లక్ష్మీ, మైనార్టీలకు షాదీ ముభారక్ పథకాల ద్వారా నిరుపేదలైన వారికి ప్రభుత్వం రూ. 51 వేలు అందిస్తోందని పేర్కొ న్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లకే అధిక ప్రాధాన్యం కల్పిస్తూ అత్యధికంగా ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రీజనల్ డిప్యూటి డైరెక్టర్ ఇ. మల్లేశ, మార్కెటింగ్ శాఖ డిప్యూటి డైరెక్టర్ సయ్యద్ ఇప్తికార్ నజీబ్, చేవెళ్ల ఆర్డీఓ కె. చంద్రమోహన్, సిసిఐ సిపిఓ చంద్రకాంత్, వ్యవసాయశాఖ ఏడిఎ దేవ్‌కుమార్, చేవెళ్ల తహసీల్థార్ వి. వెంకట్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడిఏ చాయాదేవి, చేవెళ్ల ఎంపిపి మంగలి బాల్‌రాజ్, వైస్ ఎంపిపి పోలీస్ వెంకట్‌రెడ్డి, చేవెళ్ల పిఎసిఎస్ చైర్మెన్ దేవరి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల, వికారాబాద్ మార్కెట్ కమిటి కార్యదర్శులు ఎ. చంద్రశేఖర్, శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు సామ మాణిక్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి బర్కల రాంరెడ్డి, యూత్ నాయకులు మంగలి యాదగిరి, నాయకులు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల అభివృద్ధే లక్షం: ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే లక్షంగా కృషిచేస్తు న్నట్లు చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య పేర్కొన్నారు. చేవెళ్లలో పత్తి కొను గోలు కేంద్రం ఏర్పాటు చేయడంవల్ల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోకుండా ఉంటారన్నారు. చేవెళ్ల నియోజ కవర్గంలో పాడై పోయిన రోడ్లకు అత్యధికంగా నిధులను మంజూరు చేయిం చానని తెలిపారు. జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే చేవెళ్ల నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంకణ బద్దులుగా పాటుపడుతున్నానని ఎంఎల్‌ఎ పేర్కొన్నారు.
యాలాలలో..
యాలాల: యాలాల మండల పరిధిలో ఉన్న శివసాగర్ ప్రాజెక్టు పనులను కొనసాగించడానికి నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.గురువారం యాలాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపిపి సాయన్న గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు నిధులు లేని కారణంగా శివసాగర్ ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయని సిఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు.అయితె ప్రాజెక్టు డిజైన్ మార్పు చేయాల్సిన అవసరం ఉందని ఇందు కోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే మండల పరిధిలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.1300 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టినట్లు ఇందులో ఎక్కువ శాతం తాండూరు నియోదక వర్గానికి అందులో యాలాల మండలానికి అధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.రానున్న రోజులలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్షమని ఇందుకోసం అధికారులతో పాటు స్థానిక సర్పంచ్‌లు ప్రజలకు అవగాహాన కల్పించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళితులకు భూ పంపిణికి కావల సిన భూములను కొనడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయని తెలిపారు. ఇందు కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు భూములను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.మిషన్ కాకతీయ పనులలో నాణ్యతా లోపం ఉందని గోరెపల్లి సర్పంచ్ రవిగౌడ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఇందుకు స్పందించిన మంత్రి సీరియస్‌గా స్పందించారు.సదరు కాంట్రాక్టర్ బిల్లులను నిలిపి వేయాలని అధికారులకు సూచించారు.నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.మండలంలో పెండింగ్‌లో ఉన్న ఐదు అంగన్ వాడి భవనా లను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.యాలాల మండలం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అవసరమని సంగెంకర్దు సర్పంచ్ హన్మంతు మంత్రిని కోరారు,ఇందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామి ఇచ్చారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట గదులు లేని పాఠశాలల వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.వెంటనే వాటికి నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు.మహిళా సంఘాల గ్రూపు సక్రమంగా పని చేసే విధంగా చూడాలని ఎపిఎంకు సూచించారు.జిల్లా పరిషత్ నుండి విడుదలయిన నిధులతో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో అధికారులను బాద్యులను చేస్తానని హెచ్చరించారు.మండలంలో కొనసాగుతున్న అంగన్‌వాడి,సాక్షర భారత్ కేంద్రాలు సక్రమంగా పనియించే బాధ్యత సర్పంచ్‌లదే నని తెలిపారు.సర్పంచ్‌లు సంతకాలు పెడితేనే వారికి జీతాలు చెల్లించాలని తెలిపారు.మండలంలో 103 చెరువులకు గాను 23 చెరువులను మిషన్ కాకతీయ పథకం క్రింద చేపట్టినట్లు తెలిపారు.మిగిలిన వాటిని రెండవ విడతలో ప్రారంబిస్తామని తెలిపారు.ప్రభుత్వం ప్రవెశపెడుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు నియోజక వర్గానికి 400 ఇళ్లు మంజూరు అయ్యాయని ఇందులో కలెక్టర్ లబ్దిదారులను గుర్తిస్తారని ఇందులో పార్టీల ప్రమేయం ఉండదని అన్నా రు. గ్రామాలలో అవసరైమ పనులను ఎంపిటిసిలు,సర్పంచ్‌లు నేరుగా వచ్చి తన ను కలవవచ్చని తెలిపారు.పార్టీలకు అతీతంగా మండలాన్ని అభివృద్ది చేయ డంలో అందరి సహాకారం అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బాగ్యవర్ధన్, తహాశిల్దార్ గోవింద్ రావు,పిఎసిఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, వైఎస్ ఎంపిపి రామారావు,ఆర్‌డబ్లుఎస్ ఇఇ వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.