Home తాజా వార్తలు బిగ్‌సికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్‌బాబు

బిగ్‌సికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్‌బాబు

Mahesh babu as Big C brand ambassador

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రీటైల్సోర్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను, అమ్మకాలను అందించే ఉద్దేశంతో బిగ్‌సి2002 విజయవాడలో తన తొలి స్టోర్‌కు శ్రీకారం చుట్టింది. అప్పటికే మొబైల్ మార్కెట్ స్థాయి కేవలం 2% మాత్రమే అయినా బిగ్‌సి వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించేందుకు అంకితమైంది. మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయక ముందే దానికి సంబంధించిన పూర్తి సమాచారా న్ని, ఉపయోగించే విధానాన్ని వినియోగదారులు క అందుబాటులో ఉండటం ద్వారా మొబైల్ ఫో న్ల అమ్మకాల్లో బిగ్‌సి ఉన్నతమైన ప్రమాణాలను నెలకొల్పింది. 19సంవత్సరాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 250 పై చిలుకు స్టోర్స్ నెలకొల్పి అద్భుతమైన అమ్మకాలతో మూడు కోట్ల మంది వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలతో నేడు బిగ్ సి చరిత్ర సృష్టిస్తోంది.

అద్భుతమైన ప్రజాదరణతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్న బిగ్‌సి మూడు రాష్ట్రాల మార్కెట్ లోనూ 30% వాటాను సాధించి, వినియోగదారు హృదయాల్లో నెంబర్ వన్ స్థానాన్ని పొందడం ఆనందదాయకం. ప్రచార కార్యక్రమంలో సైతం బిగ్‌సి బ్రాండ్ తొలి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అందాల అగ్రశ్రేణి నటుడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో బిగ్‌సి బ్రాండ్ అం బాసిడర్‌గా ఒప్పందం చేసుకుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రముఖ స్టార్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మాకెంతో గర్వకారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో అత్యున్నత స్తానం బిగ్ సి దే. పాపులర్ 4 మొబైల్ ఫోన్ కంపెనీలు మూడు కోట్ల పై చిలుకు బిగ్ సి విశ్వసనీయ వినియోగదారుల ద్వారానే తమ ఉత్పత్తులకు శుభారంభం చేస్తున్నాయి.

Mahesh babu as Big C brand ambassador