Friday, April 19, 2024

క్రికెట్ కోచ్‌గా మహేష్

- Advertisement -
- Advertisement -

Mahesh babu as cricket coach his next movie

 

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి. ఫస్ట్ మూవీ నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్. మొదటి సినిమా పటాస్ నుండి సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 లతో పాటు గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో కామెడీకి ప్రాధాన్యతనిచ్చే దర్శకులలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే తన ప్రతి సినిమాలో కామెడీతో పాటుగా అటు మాస్.. ఇటు క్లాస్ అంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్3 మూవీ చేస్తున్నాడు. 2019లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా.. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా రూపొందించిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్2’. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ఎఫ్3 రూపొందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమాకు కరోనా కారణంగా బ్రేక్ పడింది.

అందుకే ఇంటిపట్టునే ఉంటూ దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌లు రాసుకుంటున్నాడట. అలాగే తదుపరి సినిమాలను కూడా త్వరలో ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో సెకండ్ మూవీపై స్పందించాడు. ఖచ్చితంగా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్. అయితే ఈసారి మహేష్ బాబుతో సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పడంతో ఆసక్తి పెరిగింది. ఈసారి అనిల్ స్క్రిప్ట్ క్రికెట్ నేపథ్యంలో సాగనుందని.. ఈ సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్‌గా కనిపిస్తాడని టాక్. మరి మహేష్ క్రేజ్ ప్రకారం.. ఈ సబ్జెక్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్… త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో ఓ మూవీ చేయాల్సి ఉంది. మరి అనిల్‌తో మూవీ ఆ సినిమాకు ముందా లేదా తర్వాత అనేది కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News