Wednesday, April 24, 2024

మహేష్ బాబు గొప్ప మనసు

- Advertisement -
- Advertisement -

Mahesh babu birth day wishes to makeup man

 

మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా అందరినీ గౌరవిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. బుధవారం మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకున్నాడు. ఆయన తన మేకప్‌మ్యాన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన వ్యక్తిగత మేకప్‌మ్యాన్ పట్టాభికి మహేష్ బర్త్ డే విషెష్ చెప్పడం విశేషమనే చెప్పాలి. అంత పెద్ద సూపర్ స్టార్ మేకప్‌మ్యాన్ బర్త్ డే గుర్తు పెట్టుకొని మరీ విషెష్ చెప్పడం అరుదైన విషయమే. మహేష్ వద్ద పట్టాభి చాలా కాలంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరుశురాంతో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ సెప్టెంబర్‌లో మొదలుకానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల గురించిన సబ్జెక్ట్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News