Thursday, April 25, 2024

నవంబర్ నుంచి త్రివిక్రమ్‌తో మూవీ…

- Advertisement -
- Advertisement -

Mahesh Babu, director- Trivikram movie starts from nov

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు- త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ సినిమా షూటింగ్‌ను నవంబర్ నుంచి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ముందుగా మహేష్‌పై సోలో సాంగ్‌ను, అలాగే ఒక ఫైట్ ను తీయబోతున్నారు. ఈ ఫైట్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయబోతున్నారు. ఇక 11 సంవత్సరాల తరువాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలిసింది. ఇక ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News