మహేషా ..మజాకా 1 డే/ 6 కోట్లు
బర్త్‌డే గ్రీటింగ్స్‌లో వరల్డ్ రికార్డు
సినీ సూపర్‌స్టార్ మహేశ్ బాబు(ఎంబి) క్రేజ్ స్టామినా ఏమిటనేది ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెల్లడైంది. ఆగస్టు 9వ తేదీ మహేశ్ బాబు బర్త్ డే. ప్రస్తుత కరోనా ఇతరత్రా అంశాలతో అభిమానులు భారీ స్థాయిలో వేడుకలకు దిగవద్దని ముందుగానే మహేశ్ సూచించారు. అయితేప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ ఫ్యాన్స్ బర్త్‌డే గ్రీటింగ్స్‌తో ట్విట్టర్లో ట్వీట్ల మోత మోగించారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయనకు 60.2 మిలియన్ల బర్త్‌డే గ్రీటింగ్స్ ట్వీట్లు వచ్చినట్లు, అభిమానులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా పంపించారని, ఇప్పటికే ఈ గ్రీటింగ్ ట్వీట్స్ ఒక్కరోజులో ఆరుకోట్లు దాటాయని ఆయన పిఆర్ సిబ్బంది ప్రకటన వెలువరించింది.
ఆదివారం సాయంత్రానికి ఈ లెక్క చెపుతునానమని, అర్థరాత్రి దాటేసరికి ఇది మరింతగా పెరుగుతుందని, ఒక్కరోజు ఆరుకోట్లకు పైగా గ్రీటింగ్స్ ఓ హీరోకు అందడం ప్రపంచ రికార్డు అని తెలిపారు. సరిలేరు నీకెవ్వరుతో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సినిమాతో హిట్ దక్కించుకున్న మహేశ్ ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా చిత్రీకరణ కుంటుతోంది. అయితే పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా సంబంధిత పోస్టరును నెట్లో పెట్టారు.
Mahesh babu gets 60.2 million birthday greetings