Sunday, July 21, 2024

ఫ్యామిలీతో ఎంజాయ్

- Advertisement -
- Advertisement -

Mahesh Babu

 

బ్లాక్‌బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు..’ విడుదల తర్వాత సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీతో హాలిడే టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్‌లో ఫ్యామిలీతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సూపర్‌స్టార్. ఎప్పటికప్పుడు వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్. పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్‌లో మునిగి తేలుతున్నారు మహేష్ బాబు. మరోవైపు ఈ సూపర్‌స్టార్ మోకాలికి ఆపరేషన్ జరగనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై అధికారికంగా ఎక్కడా మహేష్ స్పందించింది లేదు.

ఇకపోతే ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్‌బాబు… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ‘మహర్షి’తో మహేష్‌కి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ మరోసారి అతనితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదిరిపోయే స్క్రిప్టు సిద్ధం చేసి ఉంచారు. హాలిడే టూర్ ముగించుకుని మహేష్ ఇండియాకి తిరిగొచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం వంశీ పైడిపల్లి మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా మహేష్ సరసన నటించే ముద్దుగుమ్మల వేటలో ఉన్నారని తెలిసింది. బాలీవుడ్ నుండి ఇద్దరు ప్రముఖ తారలను ఈ సూపర్‌స్టార్ కోసం రంగంలోకి దించే పనిలో ఉన్నారట వంశీ పైడిపల్లి.

Mahesh Babu is on holiday tour with family
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News