Home సినిమా ఒకేసారి రెండు సినిమాలకు ప్లాన్

ఒకేసారి రెండు సినిమాలకు ప్లాన్

Mahesh

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సంవత్సరంలో రెండు, మూడు సినిమాలు చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదో ఒక కారణం వల్ల ఆయన సంవత్సరానికి ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాగల్గుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆతర్వాత చేస్తున్న ‘మహర్షి’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. సంవత్సరం గ్యాప్‌లో ఒక్క సినిమానే రావడంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి తన పంథాను మార్చుకోవాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘మహర్షి’ చిత్రం విడుదల కాకముందే సుకుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు ఈ సూపర్‌స్టార్. ఒకవైపు సుకుమార్ మూవీ చేస్తూనే మరో సినిమాను కూడా మొదలుపెట్టాలని మహేష్ నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఇద్దరు యువ దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇద్దరిలో విభిన్నమైన కథతో వచ్చే వారితో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నారు. యువ దర్శకుడితో ప్రయోగాత్మక చిత్రాన్ని అతను చేయనున్నట్లు తెలిసింది. సుకుమార్, యువ దర్శకుడి సినిమాల షూటింగ్‌ను ఏకకాలంలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ ఇవ్వడంతో మహేష్ కెరీర్‌లో చాలా తక్కువ సినిమాలు అవుతున్నాయి. అందుకే ఇకపై వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకొని ఏకకాలంలో తన 26వ, 27వ సినిమాలు చేయాలని అతను భావిస్తున్నారు. ఈ ప్రయోగాత్మక నిర్ణయం మహేష్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Mahesh babu Planning for Two Movie At a Time 

Telangana News