Friday, March 29, 2024

విజయ్ దేవరకొండతో మహేష్ బాబు సినిమా!

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ హీరోగానే కాకుండా పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని కూడా అనిపించుకుంటున్నారు. ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్‌తో థియేటర్స్ బిజినెస్‌తో పాటు ఎంబి ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు మహేష్. ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని సోనీ పిక్చర్స్, ఎప్లస్‌ఎస్ మూవీస్ వారితో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ముంబయ్ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా మహేష్ బాబు యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కూడా మరో సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ ఇప్పటికే మహేష్ బాబు తన ఫేవరేట్ హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే మహేష్… విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడా అనేది చూడాల్సిందే.

Mahesh babu planning to movie with Vijay Devarakonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News